
PCOS ఉన్నవారు ఇన్సులిన్ రెసిస్టెంట్ కావచ్చు, కాబట్టి కార్బ్స్ తగ్గించి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. నాచురల్ షుగర్ ఉన్న పండ్లు తినొచ్చు.హెవీ స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, బిస్కెట్స్, కేక్ లాంటివి పూర్తిగా మానేయాలి. రోజుకు కనీసం 30-45 నిమిషాలు వాకింగ్, యోగా, లేదా జిమ్ చేయాలి. స్ట్రెస్ తగ్గించడానికి యోగా & ప్రాణాయామం చేయడం మంచిది. ప్రోటీన్ & ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తినాలి. గుడ్లు, చికెన్, చేపలు, టోఫూ, పెరుగు – ఇవి ప్రోటీన్ అధికంగా కలిగి ఉంటాయి. అవిసె గింజలు, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్ – ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి. నెలసొమ్ము & హార్మోన్లను బ్యాలెన్స్ చేసేందుకు తినడం మంచిది.
గ్రీన్ టీ, దాల్చినచెక్క టీ మేతి నీరు– ఇవి మెటాబాలిజం పెంచి, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపరుస్తాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం & తేనె కలిపి తాగితే మెటాబాలిజం ఫాస్ట్ అవుతుంది. స్ట్రెస్ వల్ల PCOS మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నిత్యం ధ్యానం & ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి ఇన్సులిన్ సమస్యలు & బరువు పెరుగుదలకు కారణమవుతాయి. PCOS హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఫుడ్స్ తినాలి. అలసంద, శనగలు, అవిసె గింజలు – ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అల్లం, దాల్చిన చెక్క, మంతులు – వీటి వల్ల PCOS లక్షణాలు తగ్గుతాయి.