
పుచ్చకాయ అనేది మానవుడికి మంచి ఆహారం లో ఒకటి. పుచ్చ కాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పుచ్చ కాయలో ఉన్న ఆరోగ్య రహస్యం తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఇన్ని సీక్రెట్లు ఉన్నాయా ? అని ఆశ్చర్య పోతాం. పుచ్చ కాయలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలేమిటో చూద్దాం.
* ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. దాదాపుగా అన్ని సీజన్లలోనూ పుచ్చకాయలు దొరుకుతున్నాయి. ఎండా కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి.
* బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
* కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు కర్బూజా పండు. తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్నీ వ్యర్థపదార్థాల్నీ తగ్గిస్తుంది.
* శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్నీ వాతరోగాన్నీ నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.
* రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
* మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండే దీనిలో అనేక లాభాలు ఉన్నాయి. టమాటో లా దీనిలో లైకోఫిన్ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది. ఒక గ్రాము టమాటోలో 40 మైక్రో గాములుంటే పుచ్చకాయలో 72 మైక్రో గ్రాములు ఉంటుంది. అందుకే ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనది.