బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే సరైన ఆహారం, శారీరక వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. కొవ్వును కరిగించే కొన్ని సహజమైన డ్రింక్స్ తీసుకుంటే మెటాబాలిజం వేగంగా జరిగి బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో సహాయపడతాయి. బెల్లీ ఫ్యాట్ కరిగించే ఉత్తమమైన డ్రింక్స్. జీలకర్ర నీరు, 1 టీస్పూన్ జీలకర్రను రాత్రి పొడిగా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వడగట్టి తాగాలి. మెటాబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం + గోరువెచ్చటి నీరు, 1 గ్లాస్ గోరువెచ్చటి నీటిలో 1 టీస్పూన్ నిమ్మరసం మరియు తేనె కలిపి తాగాలి. ఈ మిశ్రమం కొవ్వును కరిగించి, శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. గ్రీన్ టీ, ఒక గ్లాస్ నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి లేదా ఆకులను మరిగించి తాగాలి.

 యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు, 1 టీస్పూన్ అల్లం తురుము నీటిలో మరిగించి, నిత్యం తాగాలి. జీర్ణక్రియ మెరుగుపరచి, పొట్ట భాగంలో కొవ్వును తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ + నీరు, 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చటి నీటితో కలిపి తాగాలి.ఇది పొట్టలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అల్లం + నిమ్మ + తేనె నీరు.గోరువెచ్చటి నీటిలో అల్లం తురుము, 1 టీస్పూన్ నిమ్మరసం, 1 టీస్పూన్ తేనె కలిపి తాగాలి. కొవ్వును కరిగించి, జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కరివేపాకు డ్రింక్, కరివేపాకు నీటిలో మరిగించి వడగట్టి తాగాలి.

 జీర్ణక్రియ మెరుగుపరచి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క నీరు. 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేడి నీటిలో కలిపి తాగాలి.ఇన్సులిన్ లెవల్స్ బాగా కంట్రోల్ చేసి బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఎక్కువ ప్రభావం ఉంటుంది. నిద్రకు 30 నిమిషాల ముందు తాగితే కొవ్వు కరిగించే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ఈ డ్రింక్స్‌ను తాగడం ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం కూడా అనుసరిస్తే బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: