విటమిన్ B12 శరీరానికి చాలా అవసరమైన పోషక పదార్థం. ఇది నరాల ఆరోగ్యం, రక్తంలోని ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, మెదడు పని తీరుకు సహాయపడుతుంది. దీని లోపం వచ్చినప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ B12 లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. అధిక అలసట & బలహీనత.శరీరానికి అవసరమైన RBC ఉత్పత్తి తగ్గడంతో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. రోజంతా నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంది. తలనొప్పి & తిప్పిరి. రక్తంలో ఆక్సిజన్ సరిపడా లేనప్పుడు తలనొప్పి, తిప్పిరి సమస్యలు ఎదురవుతాయి. నోటి పుండ్లు & నాలుక ఎర్రగా మారడం. నాలుక నొప్పిగా ఉండడం, ఫిర్యానాలా అనిపించడం, నోటి పక్కగా పుండ్లు రావడం జరుగుతుంది.

 చేతులు, కాళ్లలో గుచ్చినట్లు అనిపించడం.నరాల ఆరోగ్యం దెబ్బతినడంతో, చేతులు & కాళ్లలో గుచ్చినట్లు లేదా జబ్బు పోయినట్లు అనిపిస్తుంది. మతిమరుపు & గందరగోళం. B12 లోపం మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది, దాంతో గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. కాంగ్నిటివ్ ఫంక్షన్ మందగిస్తుంది. మూడ్ స్వింగ్స్ & డిప్రెషన్. బి12 లోపం సెరటోనిన్ స్థాయిలను ప్రభావితం చేయడం వల్ల మూడ్ మార్పులు, ఆందోళన, డిప్రెషన్ రావచ్చు. కాళ్లు బలహీనంగా అనిపించడం & నడవడం కష్టంగా ఉండడం. నరాల బలహీనత వల్ల నడిచేటప్పుడు స్థిరంగా నిలబడలేకపోవచ్చు.చర్మం పసుపు రంగులో మారడం.

 RBC తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల చర్మం వెలసిపోవడం లేదా పసుపు రంగులో మారడం జరుగుతుంది. శ్వాస అందకపోవడం & గుండె వేగంగా కొట్టుకోవడం.ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించవచ్చు. B12 లోపం అధికంగా వచ్చే వ్యక్తులు. విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారాలు.గుడ్లు, పాలు, పెరుగు, చీజ్,చేపలు, ఫోర్టిఫైడ్ సీరియల్స్, గురుతు పెట్టుకోండి: చాలా మంది శాకాహారులు B12 లోపానికి గురవుతారు, అందుకే వారికి సప్లిమెంట్స్ అవసరం కావచ్చు. మీరు ఈ లక్షణాలను అనుభవిస్తున్నారా? అయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: