
తాప ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నిమ్మరసం తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.విటమిన్ C సమృద్ధిగా ఉండటంతో నిమ్మరసం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని తేజస్సుగా మార్చడమే కాకుండా మొటిమలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం నిమ్మరసం తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తాగితే మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఇది ప్రేగుల శుభ్రతకు కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. నిమ్మరసం శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. లెమన్ వాటర్‌ను ఉదయాన్నే తాగడం మెటాబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె లేదా కొద్దిగా ఉప్పు కలిపి తాగడం మంచిది. రోజులో 2-3 సార్లు నిమ్మరసం తాగొచ్చు, కానీ అధికంగా తాగకూడదు. వేసవిలో నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీ దైనందిన ఆహారంలో దీనిని చేర్చి ఆరోగ్యంగా ఉండండి!