
ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినండి. బాదం, ఆకుకూరలు, గ్రీన్ టీ, పెరుగు, కొబ్బరి నీరు. అల్లం లేదా జీలకర్ర నీరు తాగండి.అల్లం & జీలకర్రలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ½ టీస్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి తాగితే గ్యాస్ ఇబ్బంది తగ్గుతుంది. భోజనం తర్వాత కొద్దిగా అల్లం & తేనె కలిపిన గోరువెచ్చని నీరు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజ్వయిన్ లేదా సోంపు తీసుకోండి. గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే, ½ టీస్పూన్ అజ్వైన్ పొడి & కాస్త ఉప్పు నీటితో కలిపి తాగండి. భోజనం తర్వాత సోంపు నమిలితే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. వ్యాయామం లేదా యోగా చేయండి.
గ్యాస్ మరియు పేగు సమస్యలను నివారించడానికి రోజూ 15-20 నిమిషాలు నడక చేయండి. పవనముక్తాసనం వజ్రాసనం లాంటి యోగా ఆసనాలు కడుపులో గాలి తొలగించడంలో సహాయపడతాయి. నిద్ర పద్ధతులు మార్చండి.భోజనం చేసిన వెంటనే పడుకోవడం మానేయండి. రాత్రి నిద్రకు 2 గంటల ముందే భోజనం పూర్తి చేయండి. మజ్జిగ లేదా పెరుగు తీసుకోండి. ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మంచివి, కాబట్టి భోజనం తర్వాత పెరుగు లేదా మజ్జిగ తాగండి. కొద్దిగా జీలకర్ర పొడి లేదా కొత్తిమీర కలిపితే మరింత మేలు. సాఫ్ట్ డ్రింక్స్ & ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి. కోల్డ్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, క్యాఫైన్ తగ్గించాలి. వీటి బదులు తాజా పండ్ల రసాలు లేదా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం.