
దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి గార్గిల్ చేయాలి.ఇది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది. ముడతలు, మొటిమలు, చర్మంలోని ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి చాలా ఉపయోగకరం. దానిమ్మ ఆకుల పొడిని తేనెతో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది అంతర్గతంగా చర్మాన్ని నునుపుగా & ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సమస్యలకు అద్భుత పరిష్కారం. తల చుండ్రు, జుట్టు రాలిపోవడం తగ్గించడానికి సహాయపడుతుంది. ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో తలస్నానం చేయాలి. ఇది తల చర్మాన్ని శుభ్రం చేసి జుట్టు వృద్ధిని ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దానిమ్మ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో శరీర రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి. ఆకుల టీ లేదా కషాయం తాగితే శరీరానికి శక్తినిస్తుంది.ఇది సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు & మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 5-6 దానిమ్మ ఆకులను నీటిలో మరిగించి రోజుకు ఒకసారి తాగాలి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోజుకు 1-2 సార్లు మాత్రమే తీసుకోవాలి. గర్భిణీలు & గుండె వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహాతో మాత్రమే వాడాలి. ఏదైనా అలర్జీ ఉంటే వాడడం మానేయండి.