
వేసవిలో వడ దెబ్బ అనేది కామన్. ఒక్కో సారి వడ దెబ్బతో ప్రాణాపాయ పరిస్థితి కూడా తలెత్తుతుంది. ఈ వడ దెబ్బ నివారణకు సింపుల్ ట్రిక్స్ తో చెక్ పెట్టేయవచ్చు. ఉల్లిపాయరసం ని వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అవుతుంది. అలాగే వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపిలో గాని , రుమాలులో గాని నడినెత్తిన ఉండునట్లు కట్టి నడిచిన వడదెబ్బ తగలదు. జేబులో నైనా ఉంచుకోవచ్చు. ఇక నీరుల్లిపాయ రసం రెండు కనతలకు , గుండెకి పూసిన వడ దెబ్బవలన కలిగిన బాధ తొలగి పోతుంది. అలాగే వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరం పైన నీళ్లు చల్లుతూ , తలపైన మంచు గడ్డలను వుంచి త్రాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇస్తే బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కుమ్మున ఉడికించిన మామిడికాయ రసంలో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు త్రాగుచుండిన వడదెబ్బ తగలదు.
విశ్రాంతిగా పడుకోపెట్టి కాఫీ తాగుటకు ఇచ్చిన వడదెబ్బ నుండి తట్టుకుంటారు. నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనెని వేసి కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ జరుగుతుంది. వడగండ్లు పడినప్పుడు ఏరి విబూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడువేల్లకు వచ్చినంత మంచినీటిలో వేసి ఇచ్చిన ఎండదెబ్బ నివారణ అగును. అలాగే నువ్వులనూనేలో చనుబాలు రంగరించి చెవులలో వేసి కొంచం వెచ్చటి నీళ్లలో నెయ్యివేసి ఇచ్చిన వడదెబ్బ బాధలు తగ్గును . తరవాణి తేటలో ఉప్పుని చేర్చి ఇవ్వడం ... తాటి ముంజలు పంచదారతో ఇచ్చినా వడ దెబ్బ నుంచి కోలుకుంటారు. నాలుకకు పాత ఉసిరి పచ్చడి రాసి , పుల్లని ఆవు మజ్జిగలో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసం ని త్రాగించ డం కూడా వడ దెబ్బ నివారణకు మంచి చిట్కా అవుతుంది.
అలాగే చన్నీటితో స్నానం చేయించడం లేదా వేడివేడి పల్చని గంజిలొ ఉప్పు వేసి త్రాగడం ... నిమ్మ ఉప్పుని నోటిలో వేసుకోనిన నాలుకకు ఉట ఊరి వడదెబ్బ నివృత్తి అవుతుంది. వీటితో తగు జగ్రత్తలు తీసుకుని వడదెబ్బ నుంచి తప్పించుకోగలరు. ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణా ఉపాయాలు ఉపయొగించుకొని బయటపడగలరు. ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు.