సాధారణంగా మహిళలు సైతం తమ దగ్గర డబ్బులు ఉన్నాయంటే చాలు ఎక్కువగా బంగారం కొనడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. అలాంటి మహిళలు ఈ మధ్యన బంగారంతో పాటగా స్థిరాస్తులు మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోందట. తాజాగా దేశంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకున్నది.. అన్రాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే లెక్క ప్రకారం..2022 జూన్ నాటి నుంచి లెక్కలేసుకుంటే.. స్థిరాస్తులలో అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు 21 శాతం ఉండగా.. 2024 జూన్ తర్వాత వీటి శాత 31 % పెరిగిందట. అయితే ఇందులో ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కొన్న మహిళల్లో సగానికి పైగా 90 లక్షలకు పైగా విలువలు కలిగి ఉన్న స్థిరాస్తులను కూడా కొనుగోలు చేశారట.



సర్వే చేసిన అధికారులే ఇదంతా చూసి ఆశ్చర్యపోయారట.. ఆరు నెలల్లో  మహిళలు బంగారం కంటే ఎక్కువగా  ప్రాజెక్టులను 31 శాతం మంది మహిళలు ఎంచుకున్నారట.. డబ్బులపరంగా చూసుకుంటే..45 లక్షల లోపు వాటిని 16% మంది.. 45 నుంచి 90 లక్షలు 32 శాతం మంది.. 90 నుంచి ఒకటిన్నర కోటి 33% మంది .. ఒకటిన్నర నుంచి రెండున్నర కోట్ల వరకు 11% మంది.. రెండున్నర కోట్లకు మించి మరి 8% శాతం వరకు కొన్నారు మహిళలు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఒక వాస్తవం ఉన్నదట. నిజానికి వాళ్లు సంపాదనతో కొన్నారంటే కాదు ఇంట్లో ఉంటే భర్తల సంపాదనతోనే వారి పేరు మీద ఈ ఆస్తులన్నీ కొని ఉంటారని తెలియజేస్తూ ఉన్నారు.


గతంలో ఎక్కువగా మహిళలు బంగారం అంటే ఎక్కువగా ఇష్టపడేవారు కానీ ఈమధ్య ధర భారీగా పెరిగిపోవడంతో చాలామంది భూములు, ఏదైనా స్థలాల మీద ఎక్కువగా కొనడానికి మక్కువ చూపుతున్నారట. మరి రాబోయే రోజుల్లో బంగారం కొనడం మరింత తగ్గిపోతుందని నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: