రాగి అంబలి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచే ఆరోగ్యకరమైన పానీయం. ఇది నోరూరించే రుచితో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఎండ వేడిమిని తగ్గించడానికి, శరీరానికి తగినంత పోషకాలు అందించడానికి రాగి అంబలి మంచి ఎంపిక.రుచికరమైన & ఆరోగ్యకరమైన రాగి అంబలి తయారీ విధానం. రాగి పిండి – 2 టేబుల్ స్పూన్లు. నీరు – 2 గ్లాసులు,పెరుగు – ½ కప్పు, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర పొడి – ½ టీస్పూన్, కొత్తిమీర – చిన్నచేపు, ఉల్లిపాయ – 1,పచ్చిమిర్చి – 1,కరివేపాకు – 5-6 ఆకులు, రాగి మిశ్రమం సిద్ధం చేయండి.

ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని ½ కప్పు నీటిలో మెత్తగా కలపాలి. మిగిలిన నీటిని ఒక పాత్రలో మరిగించి, అందులో రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుతూ పోయాలి. సన్నని మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి, అప్పటికి ఇది చిక్కబడుతుంది. పూర్తిగా చల్లారనివ్వాలి. రుచికరమైన అంబలి తయారీ: మిశ్రమం చల్లారిన తర్వాత, అందులో పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మళ్లీ గిలకొట్టాలి. చల్లగా ఉండేలా ఫ్రిజ్‌లో కొద్దిసేపు ఉంచుకోవచ్చు లేదా ఇట్టే తాగేయచ్చు.

తక్కువ మసాలా ఇష్టమైతే, కేవలం ఉప్పు, జీలకర్ర పొడి మాత్రమే వేసి తాగొచ్చు. రాగి అంబలి ఆరోగ్య ప్రయోజనాలు. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపరిచే ప్రొబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. పోట్యాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.శక్తిని పెంచి అలసటను దూరం చేస్తుంది. మీకు ఏ విధంగా రుచిగా అనిపిస్తే అలా మసాలాలు తగ్గించి, పెంచుకుని రాగి అంబలి రుచి చూడండి. మిగిలిన నీటిని ఒక పాత్రలో మరిగించి, అందులో రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుతూ పోయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: