
గ్యాస్, అజీర్ణం, కడుపులో గందరగోళం వంటి సమస్యలకు మంచి పరిష్కారం.మలబద్ధకాన్ని తగ్గించి, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. ఎముకల బలం పెంచుతుంది. ముల్లంగి ఆకుల్లో కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతుంది.ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముల్లంగి ఆకుల్లో విటమిన్ C, విటమిన్ A & యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. హృదయ ఆరోగ్యానికి మేలు. ఈ ఆకుల్లో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముల్లంగి ఆకల పొడి. ఆకులను ఎండబెట్టి పొడి చేసి, రోజూ ½ టీ స్పూన్ నీటితో కలిపి తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముల్లంగి ఆకల కూర, ఇతర ఆకుకూరల మాదిరిగా కూరగా చేసుకోవచ్చు.పప్పులో కలిపి వండితే రుచిగా ఉంటుంది. ముల్లంగి ఆకల పచ్చడి, మిరపకాయ, జీలకర్ర, ఇంగువ, ఉప్పు కలిపి పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఆకులను గ్రైండ్ చేసి, తేనెతో కలిపి తాగితే రక్తశుద్ధి, జీర్ణక్రియ మెరుగవుతాయి.ముల్లంగి ఆకులను వృధా చేయకుండా, వాటిని ఆహారంలో చేర్చుకోండి. ఇది ఆరోగ్యానికి పుష్కల ప్రయోజనాలను అందిస్తాయి. ఇది డయాబెటిస్ ఉన్నవారికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలకు పరిష్కారం.