చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఎక్కువ రోజులు నిలువ చేసుకుంటారు. ఎక్కువ నిల్వ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అల్లం వెల్లుల్లిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని రకరకాల కర్రీస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాడిన తర్వాత వెంటనే ఫ్రిజ్లో పెడతాము. పెట్టడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఉంటుంది. కానీ ఎండాకాలం వస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నిలవ ఉండాలంటే పేస్టులో కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రిజ్లో పెట్టాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచి ఆలోచనే,

అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీని తాజాదనాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు. సరైన విధంగా స్టోరేజ్ చేయడం ఎలా? కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టి తాయారు చేయాలి.నీరు ఎక్కువగా ఉంటే త్వరగా పాడైపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే కొద్దిగా నూనె & ఉప్పు కలపాలి. ఇది ఫ్రెష్‌గా ఉండటానికి సహాయపడుతుంది. గాలి చొరబడని గాజు జార్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్ ఉపయోగించాలి. ప్లాస్టిక్ కంటే గాజు జార్ మంచి ఎంపిక. పేస్ట్‌ను ఒకేసారి పూర్తిగా బయటకు తీయకుండా, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి.ఇది బ్యాక్టీరియా పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి సారి ఎండుకాలంలో కొద్దిగా నూనెపూసిన స్పూన్‌తో తీసుకోవడం మంచిది.నీరు తాకకూడదు, లేదంటే త్వరగా పాడవుతుంది.

 ఫ్రిజ్ & ఫ్రీజర్‌లో నిల్వ చేసే సమయం. ఫ్రిజ్‌లో → 2-3 వారాల వరకు నిల్వ ఉండవచ్చు. ఫ్రీజర్‌లో → 2-3 నెలల వరకు తాజాగా ఉంటుంది. ఐస్ ట్రేలో చిన్న క్యూబ్స్‌గా పోసి, ఫ్రీజ్‌ చేసి, తర్వాత జిప్‌ లాక్ బ్యాగ్‌లో నిల్వ చేయొచ్చు.ఇది వాడటానికి సులభంగా ఉంటుంది, ఒకటి రెండు క్యూబ్స్ తీసుకుని నేరుగా వంటల్లో కలుపుకోవచ్చు. నీటితో మిక్స్ చేసి నిల్వ చేయకూడదు. ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేయడం మంచిది కాదు. ఎక్కువ సేపు గాలి తగిలేలా ఉంచకూడదు. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తాజాదనం & పోషకాలు కాపాడుకునేలా ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేయడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: