దానిమ్మ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామందికి తెలిసే ఉంటుంది. దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. బ్లడ్ సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మకాయను తప్పకుండా తినండి. దానిమ్మ గింజలు తినడం వల్ల బ్లడ్ అనేది ఎక్కువగా పడుతుంది. వేసవికాలంలో దానిమ్మ గింజలను జ్యూస్ లా చేసుకుని కూడా తాగవచ్చు. హార్ట్ ఎటాక్ సమస్యను తగ్గిస్తుంది. డైలీ ఒక దానిమ్మ పండుని తప్పకుండా తినాల్సిందే.

దానిమ్మ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా రకరకాల టిప్స్ ఫాలో అవ్వడం మంచిది. దానిమ్మ పండు వేసవి కాలంలో శరీరానికి ఎంతో మంచిది. ఇది నేరుగా తినడం మాత్రమే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన మార్గాల్లో తీసుకుంటే వడదెబ్బ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. దానిమ్మ పండు తినే ఉత్తమ మార్గాలు. జ్యూస్‌గా తాగడం – తాజా దానిమ్మ గింజలను నూరి, కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దానిమ్మ, పెరుగు మిశ్రమం – దానిమ్మ గింజలను పెరుగు లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

స్మూతీగా తయారు చేసుకోవడం – దానిమ్మను బనానా, ద్రాక్ష, పాలతో కలిపి స్మూతీగా తాగితే శక్తిని పెంచుతుంది. సలాడ్‌లో కలపడం – కీరదోస, టమోటా, మిరియాల పొడి, ఉప్పుతో కలిసి దానిమ్మను తీసుకుంటే వేడికి ఎదురొడ్డి శరీరానికి తేమను అందిస్తుంది. నరుగా తినడం – రోజుకు ఒక దానిమ్మ పండు తింటే రక్తప్రసరణ మెరుగవ్వడమే కాకుండా ఒంటిని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C, పొటాషియం లాంటి పోషకాలు వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వేసవిలో దీన్ని తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోండి. వేసవికాలంలో దానిమ్మ గింజలను జ్యూస్ లా చేసుకుని కూడా తాగవచ్చు. హార్ట్ ఎటాక్ సమస్యను తగ్గిస్తుంది. డైలీ ఒక దానిమ్మ పండుని తప్పకుండా తినాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: