చాలామందికి తలనొప్పి మరి విపరీతంగా వాస్తు ఉంటుంది. అలాంటి వారికి మైగ్రేన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మైగ్రేన్ సమస్య ఉన్నవారికి తలనొప్పి తగ్గడానికి ఒక టీ ని తాగితే సరిపోతుంది. టీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అల్లం టీ తాగడం వల్ల తలనొప్పి ఇట్టే తగ్గుతుంది. దాల్చిన చెక్క మరిగే టీలో కొద్దిగా కలుపుకుని తాగిన తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ టీలు ని తప్పకుండా తాగండి. తలనొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల హేర్బల్ టీలు చాలా సహాయపడతాయి.

 ఇవి నెర్వస్ సిస్టమ్‌ను రిలాక్స్ చేయడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తలనొప్పి తగ్గించే బెస్ట్ టీలు. అద్రక్ టీ – ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి మైగ్రైన్, ఒత్తిడి కారణంగా వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. ఒక కప్పు నీళ్లలో కొద్దిగా అల్లం ముక్కలు వేసి మరిగించాలి, మెత్తగా వడకట్టి తేనె కలిపి తాగాలి.పుదీనా టీ – కూలింగ్ ఎఫెక్ట్‌తో మైగ్రైన్, సైనస్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. పుదీనా ఆకులు మరిగించిన నీటిలో వేసి, కొన్ని నిమిషాలు నాననిచ్చి తేనెతో తాగాలి. క్యామమైల్ టీ – ఒత్తిడి, నిద్రలేమి వల్ల వచ్చే తలనొప్పికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.

క్యామమైల్ పువ్వులను మరిగించిన నీటిలో వేసి 5 నిమిషాలు నాననివ్వాలి, తర్వాత వడకట్టి తాగాలి. తులసి టీ – స్ట్రెస్ రీడ్యూసింగ్ గుణాలతో తలనొప్పిని త్వరగా తగ్గిస్తుంది.కొద్దిగా తులసి ఆకులను మరిగించిన నీటిలో వేసి తేనె కలిపి తాగాలి. దాల్చిన చెక్క టీ – రక్తప్రసరణను మెరుగుపరిచి తలనొప్పిని తగ్గిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడిని వేడినీటిలో కలిపి తాగాలి. ఈ టీలు తాగితే తలనొప్పి సహజంగా తగ్గడమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. తరచుగా తలనొప్పి వస్తుంటే, తగినన్ని ద్రవాలు తీసుకోవడం, తక్కువ ఒత్తిడిలో ఉండటం కూడా ముఖ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: