
పసుపు రక్తనాళాలను శుభ్రపరిచి, బిపి నియంత్రించడంలో సహాయపడుతుంది.గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటి తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది మంచి పరిష్కారం. క్యాఫేన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. సాధారణ కాఫీలో క్యాఫేన్ ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు వస్తాయి. పసుపు కాఫీలో క్యాఫేన్ తక్కువగా ఉండటంతో శరీరానికి హాని ఉండదు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.కుర్కుమిన్ మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచి, మెమొరీ పవర్ పెంచుతుంది.డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
పసుపులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.శరీరంలో వాపులను తగ్గించడానికి, కీళ్ల నొప్పుల సమస్యను నివారించడానికి చాలా మేలైన ఔషధం.ఆర్థరైటిస్ ఉన్నవారు ఈ కాఫీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో దురదపూతల వల్ల వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.టాక్సిన్స్ రిమూవ్ చేసి, శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. పసుపు కాఫీ ఎలా తయారు చేయాలి? 1 కప్పు నీరు లేదా బాదం పాల,1/2 tsp పసుపు పొడి,1/2 tsp దాల్చిన చెక్క పొడి,1/4 tsp అల్లం పొడి, కొద్దిగా తేనె లేదా స్టీవియా. ఒక పాన్‌లో నీరు లేదా పాలను వేడి చేయండి. అందులో పసుపు, దాల్చిన చెక్క పొడి, అల్లం పొడి వేసి మరిగించాలి. 2 నిమిషాలు మరిగించాక, ఒక కప్పులోకి వడకట్టి తేనె కలిపి తాగండి.