ఎండాకాలంలో దానిమ్మ రసం తాగడం చాలా మంచిది, ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరచి, డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. ఎండలో ఎక్కువగా చెమటపడటం వల్ల శరీరంలో నీరు, మినరల్స్ తగ్గిపోతాయి. దానిమ్మ రసం తాగడం వల్ల శరీరానికి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. కూలెంట్ లాంటిది, వేసవిలో తాగితే వేడి తగ్గుతుంది.వేడి వల్ల వచ్చే మంట, అలసటను తగ్గిస్తుంది. రక్తం శుద్ధి & హీమోగ్లోబిన్ పెరుగుతుంది. ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది.

 రక్తప్రసరణ మెరుగుపరచి శరీరానికి తాజాదనం ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో హార్ట్ హెల్త్ బాగుంటుంది.బిపి తగ్గించి, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రిస్తుంది. జీర్ణక్రియకు మంచిది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.వేసవిలో సూర్యరశ్మి ప్రభావం వల్ల చర్మం డల్‌గా మారుతుంది.దానిమ్మ రసం తాగడం వల్ల చర్మానికి మోయిశ్చరైజింగ్ ఇస్తుంది, యాంటీ-ఎజింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఇమ్యూనిటీ పెంచుతుంది. విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, ఫీవర్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది.

వేడి కారణంగా చాలామందికి యూరినరీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దానిమ్మ రసం తాగడం మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. షుగర్ పేషంట్లు – ఎక్కువ తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. లో బీపీ ఉన్నవారు – దానిమ్మ రసం బీపీ తగ్గించే గుణాలు కలిగి ఉంటుంది, కాబట్టి లో బీపీ ఉన్నవారు మితంగా తాగాలి. లూస్ మోషన్ ఉన్నవారు – అధిక ఫైబర్ వల్ల మలం ద్రవంగా మారే అవకాశం ఉంటుంది. తాజా రసం తాగాలి, ప్యాకెట్ లేదా ప్రిజర్వేటివ్ ఉన్న జ్యూసులు తాగకూడదు.చక్కెర లేకుండా తాగితే ఇంకా ఆరోగ్యకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: