డిన్నర్ చేసిన తర్వాత వీటిని తినటం వల్ల బరువు అనేది ఈజీగా తగ్గుతారు. రాత్రి డిన్నర్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గొచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత అల్లం టీ తాగితే బరువు తగ్గడానికి వీలవుతుంది. బరువు కూడా కంట్రోల్ అవుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత దాల్చిన చెక్క నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆకలి తగ్గిపోతుంది. బరువు కంట్రోల్లో ఉంటుంది. బరువు తగ్గడానికి సోంపు టీ కూడా బాగా ఉపయోగపడుతుంది.

రాత్రి అన్నం తిన్న తర్వాత ఈ టీ ని తాగడం వల్ల బ్లోటింగ్ వంటి ఇబ్బందులు ఉండవు. గ్రీన్ టీ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు. రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రీన్ టీ తాగితే బరువు కంట్రోల్లో ఉంటుంది. డిన్నర్ తర్వాత కొన్ని ప్రత్యేకమైన పానీయాలను తాగడం మెటాబోలిజాన్ని పెంచి, కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది. హానికరమైన పదార్థాలు లేకుండా సహజంగా తయారు చేసుకునే ఈ డ్రింక్స్ బరువు తగ్గే ప్రయాణంలో సహాయపడతాయి.డిన్నర్ తర్వాత తాగవచ్చిన డ్రింక్స్. గోరువెచ్చని నిమ్మరసం. నిమ్మరసం శరీరంలో టాక్సిన్స్‌ను బయటకు పంపించడమే కాకుండా, కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది. మెంతుల నీరు, మెంతులు మెటాబోలిజాన్ని పెంచి, కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి.

రాత్రిపూట ఒక టేబుల్ స్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగాలి. జీలకర్ర నీరు, ఒక టీస్పూన్ జీలకర్రను వేడి నీటిలో ముంచివేసి 10 నిమిషాల తర్వాత ఆ నీటిని తాగాలి. దాల్చిన చెక్క టీ, దాల్చిన చెక్క ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి, కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.ఒక కప్పు వేడి నీటిలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి 10 నిమిషాలు మరిగించి తాగాలి. అల్లం టీ, అల్లం శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. అల్లం ముక్కలను నీటిలో మరిగించి, తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్స్ డైలీ తాగడం వల్ల మెటాబోలిజం బాగా పని చేసి, బరువు తగ్గడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: