
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంద. పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. విటమిన్ C చర్మానికి మెరుగు తీసుకొస్తుంది.బ్రొమెలైన్ చర్మం మీద మృతకణాలను తొలగించి, సహజ మెరుపునిస్తుంది.ఎముకలకు బలాన్ని ఇస్తుంది.ఇందులో మాంగనీస్ అధికంగా ఉండటంతో ఎముకలు బలంగా మారతాయి.ఆస్టియోపోరోసిస్రి స్క్ తగ్గించగలదు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో శరీరానికి చాలా మంచిది.
అనాసలో ఉండే సెరోటోనిన్మె దడుకు ఉత్తేజాన్ని ఇచ్చి, మూడ్‌ను మెరుగుపరిచే పనిని చేస్తుంది. తాజా అనాస ముక్కలు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. దాని రసాన్ని స్కిన్‌కేర్ కోసం కూడా ఉపయోగించవచ్చు. రోజుకు 1-2 ముక్కల మేరకు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఖాళీ కడుపుపై అనాస తినకూడదు, ఇది కొంతమంది లో అసిడిటీని పెంచవచ్చు. మధుమేహం ఉన్నవారు పరిమితంగా తినాలి, ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అనాస పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, కానీ మితంగా తీసుకోవడం అవసరం. యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.యాంటీఆక్సిడెంట్లు ఉండటంతో వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గే వారికి ఉత్తమమైన ఆహారం.