
ఇది ఇన్‌సులిన్ ఉత్పత్తిని మెరుగుపరిచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది.మునగాకు జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణ సమస్యలను నివారిస్తుంది. ఇది పేగు వ్యాధులను నివారించే సహజమైన ఔషధం. దాహం తగ్గించి శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. మునగాకు నిర్జలీకరణం నుంచి రక్షిస్తుంది.శరీరంలోని విషపదార్థాలను తొలగించి, కాలేయాన్నిడీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇమ్యూనిటీ పెంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్లను నివారిస్తుంది. విటమిన్ C అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
ఎముకల & కీళ్ల నొప్పి సమస్యలకు మేలు. మునగాకు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇందులోని కాల్షియం & ఫాస్పరస్ ఎముకల బలాన్ని పెంచుతాయి. మునగాకు చర్మాన్ని తేమగా ఉంచి, మొటిమలు, చర్మ సమస్యలను తగ్గిస్తుంది. జుట్టు ఎదుగుదలకు మునగాకు జ్యూస్ లేదా ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు.మునగాకు PCOD, హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. గర్భిణీలు, బాలింతలు పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి మునగాకు చాలా మంచిది. కూరగాయగా వండుకుని తినొచ్చు. మునగాకు టీ తాగితే డీటాక్స్ అవుతుంది. పప్పులో లేదా పులుసులో వేసుకుని తినొచ్చు. మునగాకు పొడి తయారు చేసి, వేడి నీటిలో కలిపి తాగొచ్చు.