ప్రతి రోజు ఎలా మొదలవుతుందో, ఆ రోజు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేచిన వెంటనే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే శరీరం & మనసుకు చాలా మేలు జరుగుతుంది.గ్లాస్ నెమ్మదిగా గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది.టాక్సిన్లను బయటికి పంపి శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.లివర్ & కిడ్నీల శుభ్రతకు సహాయపడుతుంది. ఉప్పు నీరు లేదా లెమన్ వాటర్ తాగితే మరింత మంచిది.  5-10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవాలి.లేవగానే మొబైల్ లేదా tv చూడకూడదు. కొన్ని క్షణాలు మౌనంగా కూర్చొని ప్రాణాయామం లేదా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఇది మెదడు ఆక్సిజన్ స్థాయిని పెంచి, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. తేలికపాటి వ్యాయామం చేయాలి.ఉదయం లేచిన వెంటనే స్ట్రెచింగ్ చేయడం, సూర్యనమస్కారాలు, యోగా చేయడం చాలా మంచిది. ఇది శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరిచి, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది.

శరీరాన్ని తేలికపాటి కదలికలతో మొదలుపెడితే, రోజంతా శక్తిగా ఉంటారు. 1టీస్పూన్ కొబ్బరి నూనె నోటిలో వేసుకుని 5-10 నిమిషాలు మెల్లగా గారగారా కలపాలి.ఇది బాక్టీరియాను తొలగించి, నోటికి, జీర్ణక్రియకు చాలా మంచిది. కళ్ళకు చల్లటి నీరు చల్లి 10 సెకండ్లు కంటి తలుపులు మూసుకుని ఉంచితే, చూపు మెరుగుపడుతుంది. ఉదయాన్నే కాస్త సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం చాలా మంచిది.ఇది vitamin D ఉత్పత్తిని పెంచి, మెటబాలిజం బాగా పని చేసేలా చేస్తుంది. ఉదయం సూర్యకాంతి చూసినప్పుడు మానసిక ఉల్లాసం, హార్మోన్ల సమతుల్యత మెరుగవుతాయి. 10-15 నిమిషాలు సూర్య కిరణాల్లో ఉండటం మంచి ఆరోగ్య రహస్యం. ఈ రోజు నాకు గొప్పగా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుంది" అనే మంచి ఆలోచనలు పెట్టుకోవాలి.

ఇది మెదడును శాంతి, ఆనందంగా ఉంచడంలో సహాయపడుతుంది. 5 నిమిషాల ధ్యానం / ప్రాణాయామం చేస్తే మెదడు శాంతిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తినాలి.ఉదయం నల్ల కాఫీ, టీ మాత్రమే తాగితే ఆసిడిటీ పెరిగే ప్రమాదం ఉంటుంది.ఫైబర్, ప్రోటీన్, గుడ్లు, గ్రీన్ టీ, పండ్లు తినడం మంచిది.ఉదయం ఆరోగ్యకరమైన అలవాట్లతో ప్రారంభిస్తే రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు.లేవగానే మొబైల్ చూడకూడదు – మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ/టీ తాగకూడదు – ఆమ్లత్వం పెరుగుతుంది. లేవగానే గడప దాటకూడదు – శరీరం సడన్‌గా ఆడ్జస్ట్ అవ్వదు. ఉదయాన్నే మనం చేసే పనులు రోజంతా శరీరం & మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. కనుక నీరు తాగడం, స్ట్రెచింగ్, సూర్యకాంతిని పొందడం, ధ్యానం చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ఎంతో ముఖ్యమైనవి.

మరింత సమాచారం తెలుసుకోండి: