
వేడి కారణంగా కొన్ని విటమిన్లు నశించవచ్చు. గుండె ఆరోగ్యానికి ఏది బెటర్? ఉడకపెట్టిన పల్లీలు మంచి కొవ్వులు కలిగి ఉంటాయి & చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. వేయించిన పల్లీల్లో వేడిని కలిపితే కొన్నిసార్లు ఒమేగా-6 అధికమై గుండె సమస్యలు పెంచే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఉడకపెట్టిన పల్లీలే ఉత్తమం. ఉడకపెట్టిన పల్లీలు ఎక్కువగా ఫైబర్ కలిగి ఉండటం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. అవి తేలికగా జీర్ణమవుతాయి & మలబద్ధకాన్ని నివారిస్తాయి. వేయించిన పల్లీలు కొన్నిసార్లు జీర్ణ సమస్యలు కలిగించవచ్చు, ఎందుకంటే అవి కాస్త నూనెతో వేయించబడతాయి లేదా ఎక్కువ కాల్చబడతాయి. బరువు తగ్గడానికి ఏది మంచిది? ఉడకపెట్టిన పల్లీల్లో తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ ఉండటం వల్ల బరువు తగ్గే వారికి బెటర్.
వేయించిన పల్లీలు ఎక్కువ నూనెతో వేయిస్తే, అధిక కేలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉడకపెట్టిన పల్లీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉంటాయి, ఇది బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. వేయించిన పల్లీలలో కాస్త శరీర ఉష్ణోగ్రత పెంచే లక్షణం ఉండొచ్చు, ఇది కొంతమంది మధుమేహ రోగులకు అనుకూలంగా లేకపోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మితంగా ఉడకపెట్టిన పల్లీలు తింటే మంచిది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి.తక్కువ కొవ్వు & ఎక్కువ ప్రోటీన్. గుండె ఆరోగ్యానికి మేలు.బరువు తగ్గడానికి ఉపయోగకరం. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. వేయించిన పల్లీలను తక్కువ నూనెలో & మితంగా తింటే హాని లేదు. కానీ ఎక్కువగా కాల్చిన / ఉప్పుతో వేయించిన పల్లీలు ఆరోగ్యానికి మంచివి కావు.