మద్యం ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి చాలా హానికరం. కానీ, చాలామందికి అలవాటు పడిపోయిన తర్వాత మానడం కష్టం అనిపిస్తుంది. కానీ సరైన స్ట్రాటజీలు పాటిస్తే మద్యం తక్కువ చేసి, పూర్తిగా మానడానికి కూడా వీలవుతుంది. మీ లక్ష్యం క్లియర్‌గా సెట్ చేసుకోండి. మీరు మద్యం పూర్తిగా మానాలనుకుంటున్నారా లేదా పరిమితంగా తాగాలనుకుంటున్నారా. ఏ రోజునుండి తగ్గించడం మొదలు పెట్టాలి. మీరు రోజుకు/వారానికి ఎంత తాగుతున్నారో గమనించండి – రోజురోజుకీ దాన్ని తగ్గించుకోవచ్చు. ఒకేసారి మానడం కష్టం అయితే, తరచుగా తాగే పరిమాణాన్ని తగ్గించండి. ఉదాహరణకు, మీరు రోజుకి 3 గ్లాసులు తాగితే, మొదట 2 గ్లాసులకు తగ్గించుకోండి. కొన్ని వారాల పాటు దానిని 1 గ్లాసుకు తగ్గించండి. చివరికి వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే తాగడం వరకు కంట్రోల్ చేయండి.

 మద్యం తాగే సందర్భాలను గుర్తించి తప్పించండి. ఎప్పుడు ఎక్కువగా తాగుతారు? ఒంటరిగా ఉన్నప్పుడు? ఈ పరిస్థితులలో మద్యం తాగకుండా ఉండటానికి కొత్త అలవాట్లు పెంచుకోండి. ఉదాహరణకు, ఒంటరిగా బోర్ అయితే కాఫీ షాప్‌కి వెళ్లండి లేదా వాకింగ్‌కు వెళ్ళండి. ఫ్రెండ్స్‌తో మద్యం పార్టీల్లో భాగం కాకుండా ఫిట్‌నెస్ యాక్టివిటీలు లేదా మ్యూజిక్ నైట్ వంటి కొత్త అలవాట్లు ఏర్పరచుకోండి. ప్రత్యామ్నాయ పానీయాలను ట్రై చేయండి. మద్యం తాగాలనే తలంపు వచ్చినప్పుడు హెర్బల్ టీ, నోనాల్కహాలిక్ బీవరేజెస్, డెటాక్స్ వాటర్ తాగండి. కొన్ని సార్లు కోక్, సోడా లేదా ఫ్రూట్ జ్యూస్ తాగడం కూడా మద్యం తాగాలనే కోరికను తగ్గించవచ్చు. బరువు తగ్గాలనుకుంటే లెమన్ వాటర్ లేదా గ్రీన్ టీ ట్రై చేయండి. మద్యం తాగేందుకు బదులు కొత్త హాబీలను అభివృద్ధి చేసుకోండి. యోగా, మెడిటేషన్ – మద్యం తగ్గించడంలో చాలా సహాయపడతాయి. జిమ్, రన్నింగ్, సైక్లింగ్ లేదా డాన్స్ క్లాస్‌లో చేరండి.

 పుస్తకాలు చదవడం లేదా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మద్యం మీద దృష్టిని తగ్గించండి. మద్యం వల్ల కలిగే నష్టం గురించి తెలుసుకోండి. లివర్ డ్యామేజ్, హార్ట్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, మెమరీ లాస్ – ఇవన్నీ మద్యం అధికంగా తాగితే కలిగే ప్రమాదాలు. వీటి గురించి తెలుసుకుంటే ఆలోచనలో మార్పు వచ్చి, తగ్గించాలనే ప్రేరణ కలుగుతుంది. ఒక నెల మద్యం తక్కువ తాగగలిగితే మీకు నచ్చిన గిఫ్ట్ కొనుక్కోండి. మద్యం తగ్గించిన ప్రతిసారీ ఆర్థికంగా ఎంత సేవ్ అయ్యిందో గమనించండి – అది మీకు ప్రేరణ ఇస్తుంది. మీ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌కు మీ లక్ష్యం చెప్పండి – వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కలిసి మద్యం తాగే ఫ్రెండ్స్‌కి కాస్త దూరంగా ఉండండి లేదా వారితో కొత్త హాబీలు ట్రై చేయండి. మద్యం పూర్తిగా మానాలనుకుంటే, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడాన్ని కూడా పరిగణించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: