వేసవి కాలంలో పుదీనాను ఆహారంలో చేర్చుకోవడం శరీరానికి శీతలతను అందించడమే కాకుండా, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. పుదీనాను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే కొన్ని సరళమైన మార్గాలు ఇవే. పుదీనా నీరు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా నీరు తాగితే శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పుదీనా ఆకులు వేసి 10 నిమిషాలు నానబెట్టి తాగాలి. పుదీనా టీ, వేసవి వేడిని తగ్గించేందుకు పుదీనా టీ అద్భుతమైన పరిష్కారం. నీటిలో పుదీనా ఆకులు, అల్లం ముక్కలు వేసి మరిగించాలి.

 5 నిమిషాల తర్వాత తేనె కలిపి తాగాలి. పుదీనా శర్భత్, వేడి నుండి రిలీఫ్ ఇవ్వడానికి పుదీనా శర్భత్ బెస్ట్.1 గ్లాస్ నీటిలో కొంచెం నిమ్మరసం, పుదీనా ఆకుల పేస్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, బెల్లం లేదా తేనె కలపాలి. చల్లగా చేసుకుని తాగితే వేసవికి చక్కని కూలింగ్ డ్రింక్ అవుతుంది. పుదీనా చట్నీ, ఈ చట్నీని రొటీన్ భోజనంలో చేర్చుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, అల్లం, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి. పుదీనా పరాఠా లేదా రైస్, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి పుదీనా పరాఠా చేసి తినవచ్చు. భోజనానికి పుదీనా రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. సలాడ్స్‌లో పుదీనా. కీరా, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ ముక్కలతో తయారుచేసిన సలాడ్‌లో కొత్తిమీరతో పాటు పుదీనా కూడా కలిపి తినవచ్చు.

పెరుగు లో కలిపి తినడం, పుదీనా+పెరుగు కలిపి తింటే జీర్ణ సమస్యలు తగ్గి శరీరానికి చల్లదనం వస్తుంది. పుదీనా ఐస్ క్యూబ్స్, నీటిలో పుదీనా ఆకులు వేసి ఫ్రీజ్ చేయాలి.ఈ ఐస్ క్యూబ్స్‌ను జ్యూస్‌లలో, లెమన్ వాటర్‌లో వేసుకుని తాగవచ్చు. పుదీనా-నిమ్మ పెట్ కూలర్,వేసవిలో పొట్టలో చల్లదనం కోసం పుదీనాను నిమ్మకాయ, బెల్లంతో కలిపి మిక్స్ చేసి తాగాలి. మజ్జిగలో పుదీనా, జీలకర్ర పొడి కలిపి తాగితే వేడిని తగ్గించడంలో, జీర్ణసమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా రోజువారీ ఆహారంలో పుదీనాను చేర్చుకోవడం వల్ల వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: