
విటమిన్ E, ఐరన్, డైట్‌రీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ ఇస్తుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. పిమ్పుల్స్, మొటిమలు తగ్గుతాయి. హృదయ ఆరోగ్యానికి మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. మధుమేహ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. హార్మోన్ల బ్యాలెన్స్ చేస్తుంది.
మహిళల్లో PCOS, నెలసరి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. గర్భిణీలకు ఇది చాలా మంచిది – కానీ డాక్టర్ సలహా తీసుకోవాలి. జీలకర్ర నీరు నెచురల్ డయురెటిక్ లా పనిచేసి కిడ్నీలను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. యూరిన్ ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. నిద్రలేమి ఉన్నవారికి ఇది సహాయపడుతుంది. జీలకర్ర నీరు తయారు చేసే విధానం. సింపుల్ జీలకర్ర నీరు,రాత్రి 1 టీస్పూన్ జీలకర్రను 1 గ్లాస్ నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. నిమ్మ-జీలకర్ర డ్రింక్, నానబెట్టిన జీలకర్ర నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి తాగితే ఇంకా బాగా పనిచేస్తుంది. అల్లం-జీలకర్ర టీ, మరిగించిన నీటిలో జీలకర్ర, అల్లం వేసి 5 నిమిషాలు ఉంచి తాగాలి.