- ( లైఫ్ స్టైల్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ప్ర‌స్తుతం మ‌నిషి జీవిన శైలీలో చాలా మార్పులు వ‌చ్చేశాయి. మ‌నుష్యులు తీవ్ర‌మైన ఒత్తిళ్ల మ‌ధ్య‌లో జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు మ‌నుష్యులు చేసే ప‌నిలో వేగం పెరిగి పోయింది. మారుతున్న పోటీ ప్ర‌పంచం లో అంద‌రి కంటే ముందు వ‌రుస‌లో ఉండాల‌న త‌పన తో పాటు ఆ తాప‌త్ర‌యం మ‌నిషి ని తీవ్ర‌మైన ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ క్ర‌మంలో మ‌నిషి ప‌నిలో ప‌డిపోయి ఆరోగ్యాన్ని తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. ఇది మ‌నిషి ని తీవ్ర‌మైన అనారోగ్యాల‌కు గురి చేస్తోంది. అస‌లు మ‌నిషి ప‌ని ఒత్తిడి లో ప‌డిపోయి ఆరోగ్యం గురించి అస్స‌లు ఏమాత్రం ప‌ట్టించు కోవ‌డం లేదు. అందుకే చిన్న వ‌య‌స్సు లోనే ర‌క‌ర‌కాల అనారోగ్యాల‌కు గుర‌వుతున్నారు. అయితే అంద‌మైన ఆరోగ్యం కోసం ప్ర‌తి రోజు ఉద‌యాన్నే కొన్ని జాగ్ర‌త్త‌లు ప్ర‌తి ఒక్క‌రు తీసుకోవాలి. ఉద‌యాన్నే వేకువ ఝామునే లేచి ధ్యానం చేయ‌డం .. కాస్త న‌డ‌వ‌డం తో పాటు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.


* ఉదయాన్నే పరగడుపున గ్లాస్ గోరువెచ్చటి నీటిలో టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
* రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి . .. దీని వ‌ల్ల గుండె లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ బాగుంటుంది.
* గుండె పనితీరు మెరుగవుతుంది .. గుండె ప‌ని తీరు బాగుంటే ఆటో మేటిక్ గా శ‌రీరంలో మిగిలిన అవ‌య‌వాల ప‌ని తీరు బాగుంటుంది.
* కీళ్లనొప్పులు, వాపులు తగ్గుతాయి
* మలబద్దకం సమస్య తొలగిపోతుంది . . దీని వ‌ల్ల మ‌నిషి యాక్టివ్ గా ఉంటారు..
* శరీరానికి తగినంత శక్తి చేకూరుతుంది
* శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది . .. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
* వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు .

మరింత సమాచారం తెలుసుకోండి: