కలియుగంలో శాస్త్రీయ సిద్దాంతం ప్రకారం అయితే శృంగార సామ‌ర్థ్యం తగ్గింద‌ని చెపుతున్నారు. అయితే
విచ్చలవిడి శృంగారం పెరిగింది, అంటే అసలు శృంగారం  అంటే దాని విలువలు తెలియని స్థితికి తీసుకొచ్చారు. ఇక ఒక పురుషుడికి 14 సంవత్సరాల నుంచే మరొక జీవిని సృష్టించే శక్తి మొదలవుతుంది.
అలాగే స్త్రీ లలో కూడా వీరికి ఒక జీవికి ప్రాణం పోసే శక్తి వస్తుందట. అంటే ఇద్దరిలోనూ ఆ నూతన సృష్టిని భూ ప్రపంచానికి పరిచయం చేసే శక్తి ఉంటుంది.


యువత ఈ శక్తిని వారి భవిష్యత్తును మెరుగుపరచుకునే ఆలోచనలు కలిగి.. ఇతర కామ, వ్యామోహాలకు దూరంగా ఉండి... వారి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని... వాటిలో మెరుగైనది ఎంచుకుని కార్య రూపం దాల్చే విధంగా ప్రయత్ని, వారిలో ఈ యవ్వన శక్తిలో దాగి ఉన్న నూతన శక్తిని, లేదా నూతన సృష్టిని సృష్టించే శక్తి ప్రభావంతో వారు కెరీర్‌లో బాగా స‌క్సెస్ అవుతార‌ని అధ్య‌య‌నాలు చెపుతున్నాయి.


ఇక ఇప్పటి శృంగారం అనేది.. కామాన్ని ముసుగుగా ధరించి చెడు మార్గంలో నడుస్తోంది…చివరికి బహిరంగం అయినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఒక మనిషి తప్ప.. ప్రకృతిలో ఏ జంతు జాలమూ, ఏ ప్రాణీ విచ్చలవిడి శృంగారం చేయదు... మనిషి తప్ప, ప్రతి జీవి ప్రకృతి నియమాలను పాటిస్తూ..అవి ఆ ప్రకృతి నియమించిన కాలాలలో మాత్రమే అవి శృగారం జరుపుతూ వాటి సంతానాన్ని ఆరోగ్య వంతంగా భూ ప్రపంచానికి అందిస్తాయి.. కానీ మ‌నిషి శృంగారం వెర్రిగా మారుతోంది. ఇంకా చెప్పాలంటే ఇది కామం అనే రూపం సంతరించుకుంది.


ఇక ప్రస్తుతం శృంగారం సామర్థ్యం తగ్గడానికి.. ప్రకృతి ఆహ్లాదం అంతగా లేదు. ఆహారపు అలవాట్లు, ప్రతి దానికీ ఏదో ఒక మందు బిళ్ళను వేసుకోవడం. కాలానుగుణంగా బ్రతుకుతెరువు కోసం ఇద్దరూ ఉద్యోగం చేయడం…పల్లెల్లో ఇది అంతగా లేకపోయినా.. పట్టణాల్లో ఇది సహజం అయిపోయింది. ఇంటికి రాగానే, పిల్లలు వంట పనులు.. వీటితోనే అలసి పోవడం ఇక ఏకాంత సమయం దొరకని పరిస్థితి కూడా కారణం. ఇలా పైన చెప్పుకున్న కార‌ణాలు అన్నీ క‌లియుగంలో ప్ర‌స్తుత కాలంలో శృంగార సామ‌ర్థ్యం త‌గ్గింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: