
మన శరీరంలో లవ్ హార్మోన్ అనే పేరుతో ప్రసిద్ధమైనది ఆక్సిటోసిన్. ఇది మనిషికి ఆనందం, అనురాగం, బంధం అనే భావాలను కలిగించే హార్మోన్. ఇది పెరిగితే మనం హ్యాపీగా, సురక్షితంగా భావిస్తాం.ఇది సహజంగా పెరగడానికి కొన్ని చక్కని మార్గాలు ఉన్నాయి.ఆక్సిటోసిన్ పెంచే సహజ మార్గాలు. ఆప్యాయంగా ఉండటం, హగ్గులు, ముద్దులు, చెంప మీద స్పర్శ వంటి స్నేహ, ప్రేమతో మాట్లాడటం, మానవ సంబంధాలు పెంపొందించడం. నవ్వు – ఆనందం. మనస్ఫూర్తిగా నవ్వడం.కామెడీ చూడటం, సరదా మాట్లాడటం – ఇవన్నీ ఆక్సిటోసిన్ పెంచుతాయి. సంగీతం వినడం.హృదయాన్ని తాకే సంగీతం వినడం ద్వారా ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి.
ధ్యానం మరియు యోగా, ప్రాణాయామం, శాంతంగా ఊపిరిపీల్చే సాధనలు.పంచుకోవడం,ఇతరులకు సహాయం చేయడం, చిన్నదైన గిఫ్ట్ ఇవ్వడం – ఇవి ఆక్సిటోసిన్‌ను మెరుగుపరుస్తాయి. పెంపుడు జంతువులు,కుక్క, పిల్లితో ఆడటం, వాటిని ఆలింగనం చేసుకోవడం. ఆరోగ్యకరమైన సున్నితమైన స్పర్శ,మసాజ్ చేయించుకోవడం లేదా ఇవ్వడం కూడా ఆక్సిటోసిన్‌ను పెంచుతుంది. డార్క్ చాక్లెట్, అవొకాడో, బనానా, విటమిన్-D మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఆహారం. రోజూ ఎవరి మీదైనా ప్రేమతో నవ్వుతూ చూసి, స్నేహంగా మాట్లాడితే – మీలో ఆక్సిటోసిన్ స్రవణం సహజంగానే పెరుగుతుంది.