
WHO డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ఇది సైద్ధాంతిక ముప్పు కాదు అని.. అటువంటి వ్యాధులు మళ్ళీ ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని తెలిపారు. అయితే అది ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పలేమంటూ అందరూ మాత్రం సిద్ధంగా ఉండాలంటే పిలుపునిచ్చారు. WHO నిర్వహించినటువంటి జెనీవాలో 13వ పున ప్రారంభ సమావేశంలో ఈ విషయాలను తెలియజేశారు. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ప్రపంచం ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్న గుర్తు చేశారు ముఖ్యంగా పరిస్థితులు చెక్కబడే వరకు మరో మహమ్మారి వస్తుందని అది ఎప్పుడు అని చెప్పలేము అని తెలిపారు.
20 ఏళ్లు అంతకంటే ఎక్కువైనా లేకపోతే రేపటి రోజు అయినా కూడా జరగవచ్చు ఏది ఏమైనా కూడా అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని వెల్లడించారు. కరోనా మహమ్మారి వల్ల సుమారుగా 70 లక్షల మందికి పైన మరణించారని.. వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్ల వరకు అంచనా ఉందంటు వల్లడించారు. ప్రాణ నష్టమే కాకుండా ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా పది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఆర్థిక నష్టం కలిగింది అంటూ వెల్లడించారు WHO జనరల్. ఇప్పటికీ కూడా మహమ్మారి పైన కూడా అక్కడక్కడా చర్చలు పలు రకాల దేశాలలో కూడా జరుగుతున్నాయని.. అందరూ కూడా కలిసికట్టుగా ఎదుర్కోవలసి ఉంటుందంటూ తెలిపారు.