
శరీరం ద్రవాలను నిలుపుకోవడంతో ఉబ్బినట్లు, బరువు పెరిగినట్లు అనిపిస్తుంది.ఇది అసలు కొవ్వు పెరగడం కాదు – కేవలం నీటి నిల్వ మాత్రమే. పీరియడ్స్ సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల గ్యాస్, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ ఉబ్బరం కూడా బరువు పెరిగినట్టే అనిపించవచ్చు. ఈ సమయంలో హార్మోన్ల ప్రభావంతో మహిళలకు తీపి పదార్థాలు, కారంగా ఉండే ఫుడ్, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినాలనే కోరికలు వస్తాయి. ఎక్కువ కాలొరీస్ తీసుకుంటే కొంత తాత్కాలిక బరువు పెరగవచ్చు. కొందరికి ఈ సమయంలో శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది.వ్యాయామం తక్కువ చేస్తారు లేదా పూర్తిగా ఆపేస్తారు. దీంతో శరీరంలో ఎనర్జీ ఖర్చు తక్కువగా ఉండటంతో బరువు పెరిగినట్టుగా అనిపించవచ్చు.
పీరియడ్ సమయంలో కొందరికి మలవిసర్జన సరిగ్గా కాకపోవడం జరుగుతుంది. శరీరంలో తినే ఆహారం పూర్తి జీర్ణం కాకపోవడం వల్ల అరకొర హజీమ్ సమస్యలతో కడుపు ఉబ్బుతుండటమే కాకుండా తాత్కాలికంగా బరువు పెరిగినట్లు అనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే బరువు పెరగడం ఎక్కువగా తాత్కాలికమే. పీరియడ్స్ పూర్తయ్యాక. హార్మోన్ స్థాయిలు తిరిగి సమతుల్యంగా మారుతాయి. శరీరం నిలిపిన నీటిని విడుదల చేస్తుంది.శారీరక శ్రమ మళ్లీ పెరుగుతుంది. దీంతో ఆ పెరిగిన బరువు తగ్గిపోతుంది.వినడానికి వింతగా అనిపించినా, ఎక్కువ నీరు తాగితే శరీరం నీటిని నిలుపుకోదు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే శరీరం ద్రవాలను నిలుపుకుంటుంది. పిరియడ్స్ టైంలో ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.నడక, యోగా వంటి లైటు యాక్టివిటీలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి, తగ్గుతుంది.