కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది 500 కి పైగా విధులను నిర్వహిస్తుంది — వాటిలో ముఖ్యమైనవి జీర్ణక్రియ, విసర్జన, రక్తం శుద్ధి, న్యూట్రియెంట్ల నిల్వ, హార్మోన్ సంతులనం, విషపదార్థాల నిర్మూలన. అంతగా పనులు చేసే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం చాలా కీలకమైనది. కాలేయాన్ని శక్తివంతంగా ఉంచే ఆహార పదార్థాలు. ఆవకాయ లాంటివి కాదు — ఆకుకూరలు. గోంగూర, తోటకూర, పాలకూర — ఇవి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్‌కి గొప్ప మూలాలు.కాలేయానికి వింత పదార్థాలు తొలగించడంలో సహాయం చేస్తాయి. కాలేయపు కణజాలాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. వెల్లులి, దీనిలో అలీసిన్ అనే పదార్థం ఉంది, ఇది డిటాక్స్ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ప్రేరేపిస్తుంది.

 జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.పండ్లలో రాజా – నిమ్మకాయ,నిమ్మరసం కాలేయం డిటాక్స్‌కు సహాయపడుతుంది. విటమిన్ C పుష్కలంగా ఉండి లివర్‌ను స్వచ్ఛంగా ఉంచుతుంది.ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిలో నిమ్మరసం తాగితే మంచి ప్రయోజనం.కాలేయంలో కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. డిటాక్స్ పనితీరును మెరుగుపరుస్తుంది.ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. లివర్ సెల్స్‌ను రక్షించడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు లివర్ నివారణకు సహాయపడుతుంది. బీట్‌రూట్, బీట్‌రూట్‌లో బీటలైన్స్ అనే పదార్థాలు ఉంటాయి.ఇవి కాలేయం శక్తిని పెంచుతాయి. డిటాక్స్ ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. అల్లం, అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా కాలేయం మీద ఒత్తిడి తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కాలేయానికి రక్షణ కలుగుతుంది. పసుపు. పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కాలేయం లోపల చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది.

కాలేయ కణాల పునరుత్పత్తి చేస్తుంది. నట్లు మరియు విత్తనాలు, బాదం, వాల్‌నట్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్,ఇవి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్, విటమిన్ E, ఫైబర్ కలిగి ఉంటాయి. కాలేయాన్ని ఫ్యాటీ లివర్ నుండి రక్షించగలవు. గ్రీన్ అప్‌పుల్స్, వీటిలో ఉండే ఫైబర్ మరియు మాలిక్ యాసిడ్ కాలేయానికి సహాయపడతాయి. పీచు ఎక్కువగా ఉండటం వలన టాక్సిన్లను తొలగించడంలో లివర్‌కు సహకారం. నిత్యం 3–4 లీటర్ల వరకు నీరు తాగాలి – కాలేయం డిటాక్స్‌కు ఇది అవసరం. అరటి, ద్రాక్ష, నారింజ వంటి పండ్లు ఎక్కువగా తినాలి – విటమిన్ C, ఫైబర్ కోసం. సరియైన శారీరక శ్రమ ఉండాలి – కాలేయం మీద ఒత్తిడి తగ్గుతుంది. క్రమబద్ధమైన భోజనం – సమయానికి తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మరియు కాలేయం సమన్వయంగా పనిచేస్తాయి. మద్యపానం – కాలేయాన్ని నాశనం చేసే ప్రధాన కారణం.అతి మాములుగా మందులు వాడటం – పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్ డ్రింక్స్, అధిక షుగర్ ఉన్న పానీయాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: