
తీగ జాతి కూరగాయలు (దోసకాయ, గుమ్మడి, పొట్లకాయ, కాకర, బీర, బూడిద గుమ్మడి) తినడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి. బ్రోకలీ, బచ్చలికూర మరియు కాలీఫ్లవర్ వంటి కొన్ని కూరగాయలు వసంత ఋతువు మరియు శరదృతువులో చల్లటి ఉష్ణోగ్రతలను ఇష్టపడతాయి, టొమాటోలు, దోసకాయలు మరియు మిరియాలు వంటివి వృద్ధి చెందడానికి వేడి వాతావరణం అవసరం అనే సంగతి తెలిసిందే.
వేసవిలో సాగుకు టమాట, వంకాయ, మిరప, బెండ తోపాటు గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, బూడిద గుమ్మడి లాంటి తీగజాతి కూరగాయలు అనుకూలంగా ఉంటాయి. ఈ పంటలు తేమతో కూడిన వేడి వాతావరణంలో అధిక దిగుబడిని ఇస్తాయి. అయితే, ఎక్కువ ఉష్ణోగ్రతను, ఎకువ మంచును తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు 25 -35 డిగ్రీల వద్ద మొక్కల పెరుగుదల బాగుంటుంది. దిగుబడులు కూడా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల కంటే తకువగా ఉంటే, పెరుగుదల తగ్గుతుంది. పూత, పిందె రావడం ఆలస్యమవుతుంది. అలాగే 36 డిగ్రీల కన్నా ఎకువ ఉన్నప్పుడు కూడా దిగుబడి బాగా తగ్గిపోతుంది.
నీటి తడులతోపాటు నేలలోని తేమను సంరక్షించే చర్యలూ ముఖ్యమైనవే. ఇందుకోసం పాదులు, రెండు వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను పరచాలి. దీనివల్ల నేలలో తేమ అలాగే ఉండి, మొకకు ఎకువ రోజులు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కలుపు పెరుగుదలనూ అరికడుతుంది. మల్చింగ్ పద్ధతి వల్ల నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చు.