
దీర్ఘకాలంగా ఇది కిడ్నీ డ్యామేజ్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది. ఎముకలు బలహీనపడటం, అధిక ఉప్పు, శరీరంలో కాల్షియం విసర్జనను పెంచుతుంది. ఇది ఎముకలు బలహీనంగా మారటానికి కారణమవుతుంది. ఎక్కువ కాలం తర్వాత ఇది అస్టియోపోరోసిస్ దారి తీస్తుంది. ఉప్పు నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఊపిరాడకపోవడం, చేతులు, కాళ్లు ఉబ్బడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. మానసిక సమస్యలు – మూడ్ స్వింగ్, డిప్రెషన్. తాజా పరిశోధనలు చెబుతున్నాయి: అధిక ఉప్పు, మెదడు నరాలకు ప్రభావం చూపిస్తుంది.ఇది డిప్రెషన్, ఆందోళన, అలసట వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. అధిక ఉప్పు మైక్రోబయోమ్ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది.
దీని వల్ల జీర్ణ సమస్యలు, అజీర్తి, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటుతో పాటు మెదడుకు వచ్చే రక్తప్రసరణలో ఆటంకం ఏర్పడితే స్ట్రోక్ రావచ్చు. సోడియం అధికంగా ఉండటం వల్ల మెదడు కణాలు నెమ్మదిగా మరణించవచ్చు.అధిక ఉప్పు, ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ద్వారా తీసుకుంటే పేగుల దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా ఇది గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఆ తర్వాత అన్నవాయు క్యాన్సర్ కు కారణం కావచ్చు. దాహం ఎక్కువగా వేయడం & శక్తి తక్కువవడం. అధిక ఉప్పు తీసుకుంటే శరీరానికి నీరు అవసరం ఎక్కువ అవుతుంది – దీంతో దాహం ఎక్కువగా వేస్తుంది. నీరు తగినంతగా తాగకపోతే శరీరం నీరసంగా, అలసటగా మారుతుంది. అంటే ఒక టీ స్పూన్ కంటే తక్కువ. తినే ముందు లేబుల్ చదవండి – ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కొవ్వురాలిన ఆహారం, ప్యాకెట్ స్నాక్స్, పాప్ కార్న్, జంక్ ఫుడ్స్ తగ్గించండి. స్వల్పంగా వంటలో ఉప్పు వాడండి – ఆకుకూరలు, మసాలాల రుచి పెంచండి. పులుసు, చట్నీ, పచ్చడి వంటివి పరిమితంగా తీసుకోండి.