
జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బ్లూబెర్రీస్ రక్తనాళాల గోడలను బలపరుస్తాయి.వీటిలో ఉండే ఫ్లావనాయిడ్లు రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.హై కొలెస్ట్రాల్ తగ్గించి గుండెకు రక్షణగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ C మరియు యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రోజూ తినే అలవాటు వలన చిన్నా, పెద్దా రోగాలకు వ్యతిరేకంగా శరీరం పోరాడుతుంది. బ్లూబెర్రీస్‌లో ఉండే విటమిన్ E, విటమిన్ C చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి.చర్మంపై వచ్చే మచ్చలు, వయస్సుతో వచ్చే రింకిల్స్ తగ్గుతాయి.యాంటీ-ఏజింగ్ ఫుడ్‌గా పనిచేస్తుంది. శరీరంలో విషకణాలు తొలగింపుకు సహాయపడుతుంది.బ్లూబెర్రీస్‌లో ఉండే డీటాక్సిఫయింగ్ గుణాలు లివర్, మూత్రపిండాలకు మేలు చేస్తాయి.
రోజూ తింటే శరీరం లోపలే శుభ్రత ప్రక్రియ జరుగుతుంది.బ్లూబెర్రీస్‌లో ఫైబర్ అధికంగా ఉండటంతో నిండిన భావన.అధికంగా తినకుండా నియంత్రణలో ఉండేలా చేస్తాయి.బరువు తగ్గించుకోవాలనుకునే వారికీ ఇది సహాయకారిగా మారుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్లలోని రేటినా కణాలను రక్షిస్తాయి. వయస్సుతో వచ్చే మాక్యులార్ డీజనరేషన్, నైటు బ్లైండ్నెస్ వంటి సమస్యలు తక్కువ అవుతాయి. రోజుకు 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు తినడం సరిపోతుంది. తరిగి, ఓట్స్ లేదా యోగర్ట్‌లో కలిపి తినవచ్చు. జ్యూస్, స్మూతీ రూపంలో తినవచ్చు. బ్లూబెర్రీస్ చాలా సురక్షితమైనవి. అయినా, బ్లడ్ షుగర్ సమస్యలున్నవారు డాక్టర్ సలహాతో తినాలి. ఆలర్జీ ఉంటే తినకూడదు. బ్లూబెర్రీస్ ఒక సహజ ఔషధం లాంటివి. ప్రతిరోజూ కొంతమేర తినడం వలన మెదడు, గుండె, జీర్ణవ్యవస్థ, చర్మం, కన్నులు ఇలా శరీరంలోని ప్రతిఒక్క వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇవి రుచి పరంగా కూడా ఆకట్టుకుంటాయి.