
అజీర్ణం, గ్యాస్, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. రాత్రంతా శరీరంలో చేరిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడానికి ఇది సహాయపడుతుంది. లివర్, మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది. చర్మం చక్కగా మెరిసిపోతుంది. టాక్సిన్స్ బయటకు వెళ్లిపోవడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, చర్మంపై మచ్చలు తగ్గుతాయి. బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. నీరు మెటాబాలిజాన్నివేగవంతం చేస్తుంది. తిన్నంతలోనే నిండిన భావన కలుగుతుంది, అధికంగా తినకుండా కంట్రోల్ అవుతారు. ఉదయం నీరు తాగితే మెదడు హైడ్రేట్ అయి, మరింత ఎనర్జీగా పనిచేస్తుంది. శరీర ఉష్ణోగతను నియంత్రించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది.
జలదాహం, వేసవి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.గోరువెచ్చగా ఉన్న నీరు తాగడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. వేడి నీరు కొవ్వును కరిగించే గుణం కలిగి ఉంటుంది. పరగడుపున 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గించడంలో అద్భుత ఫలితం కనిపిస్తుంది. రాత్రంతా మెంతో నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల డయాబెటిస్, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. జీరా నీరు, జీడిపప్పు వలె చిన్న గింజలైన జీలకర్రను నానబెట్టి లేదా మరిగించి తాగితే బాగా జీర్ణమవుతుంది. చర్మానికి మేలు. పరగడుపున లేవగానే ముఖం కడుక్కుని, నెమ్మదిగా నీరు తాగాలి. ఒకేసారి ఎక్కువగా కాకుండా, తక్కువగా కానీ తరచుగా తాగడం మంచిది. తాగిన తర్వాత కనీసం 30 నిమిషాలు ఏమీ తినకుండా ఉండాలి – ఇది నీటికి పని చేసే సమయం. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువ నీరు తాగకముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.