
ఇది గుట్ ఫ్లోరాను బలోపేతం చేస్తుంది, అల్లర్జీలు తగ్గిస్తుంది.ఉదయం లేదా రాత్రి, ఒక కప్పు కాఫిర్ పాలు తాగడం ఉత్తమం. సహజమైన ప్రాబయోటిక్. మంచి బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తేలికగా ఉండేలా చేస్తుంది. రోజూ కుర్డు తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. మధ్యాహ్నం భోజనంతో పాటు తీసుకుంటే ఉత్తమం. షుగర్ లేకుండా వాడాలి. ఇడ్లీ, దోసె వంటి పిండిని కొన్నాళ్లు ఉంచి వండటం వల్ల ఫెర్మెంటేషన్ జరుగుతుంది.ఇందులో సహజమైన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే బాగా పని చేస్తుంది. ఇది ఒక రకమైన ఫెర్మెంటెడ్ టీ. ఇందులో స్కోబీ అనే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. శరీర డిటాక్స్, ఎమ్యూనిటీ పెంపు, జీర్ణక్రియ మెరుగుదల కోసం బాగా ఉపయోగపడుతుంది. రోజుకు 100ml–150ml మోతాదులో తీసుకోవచ్చు. మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించాలి. మజ్జిగలో సహజమైన జీవిణులు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను శాంతింపజేస్తుంది.
వేసవి కాలంలో డీహైడ్రేషన్ కూడా నివారించగలదు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక గ్లాసు మజ్జిగ తాగడం ఉత్తమం. పచ్చళ్ళు కొన్నిసార్లు సహజంగా ఫెర్మెంటెడ్‌గా తయారవుతాయి.వీటిలో సహజమైన జీవిణులు ఉండే అవకాశం ఉంది. బాగా ఉప్పుగా ఉండే పచ్చళ్ళను తగ్గించి, ఇంట్లో చేసిన పచ్చళ్ళు మాత్రమే తీసుకోవాలి. ఇది ఉప్పు మరియు క్యాబేజీతో తయారయ్యే జర్మన్ ఫెర్మెంటెడ్ ఫుడ్.ఇందులో సహజంగా లాక్టోబాసిల్లస్ అనే జీవిణులు ఉంటాయి.ఇది జీర్ణక్రియకు, ఇమ్యూనిటీకి బాగా సహాయపడుతుంది.ఇది జపాన్ వంటకాల్లోని ముఖ్యమైన భాగం. ఫెర్మెంటెడ్ సోయా పేస్ట్‌తో తయారవుతుంది.ఇందులో బ్యాక్టీరియా ఉండటం వల్ల పేగులకు మంచిది. ఇది కొరియన్ ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్తో తయారవుతుంది.శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్‌తో కూడినది. ప్రాబయోటిక్స్ తినే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు.