
5–7 రోజులలో వాటి అడుగున మూలాలు వస్తాయి. మూలాలు వచ్చిన తర్వాత వాటిని మట్టిలో నాటాలి. మట్టిపానలో కాసింత పొలమట్టి, ఎరువు కలిపిన మిశ్రమం వేసుకోవాలి.2–3 ఇంచుల లోతులో మొక్కను నాటి, తడిగా చేయాలి. మొక్కలు నాటిన తర్వాత ప్రత్తి రోజు 1సారైన నీరు పోయాలి. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలి. ప్రతి రోజు తడిగా ఉండేలా చూసుకోండి కానీ నీరు మితిమీరితే మొక్క నశిస్తుంది. వేసవిలో రోజుకు ఒక్కసారి లేదా రెండు సార్లు నీరు వేయాలి. వర్షాకాలంలో అవసరమైతేనే నీరు వేయాలి. పుదీనాకు పాక్షిక సూర్యకాంతి సరిపోతుంది. రోజుకు కనీసం 4–5 గంటలు సూర్యకాంతి పడే ప్రదేశంలో ఉంచండి.
ప్రతి రెండు వారాలకు ఒకసారి జీవామృతం లేదా గోమయ సంపర్క మిశ్రమం వాడవచ్చు.కూరగాయలకు ఉపయోగించే సేంద్రియ ఎరువులు బాగుంటాయి. మొక్క పెరిగిన తర్వాత ఎలా వాడాలి? మొక్క నుంచి కొత్త ఆకులను నరికి వాడండి. అధికంగా కాడలు కోయవద్దు – ప్రతి కాడకు కొన్ని ఆకులు మిగలేలా చూసుకోండి. జీర్ణం మెరుగవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.చర్మ సమస్యలకు సహాయం చేస్తుంది. తలవేదనకు ఉపశమనం. చెడు వాసన తొలగించడానికి సహాయపడుతుంది. టీ, చట్నీలు, సూప్స్, జ్యూస్‌ల్లో ఉపయోగించవచ్చు. పుదీనా మొక్కను ఇంట్లో పెంచడం చాలా తేలిక, సరదాగా ఉంటుంది. ఒక్కసారి నాటి పెట్టుకుంటే, ఇది వరుసగా కొత్త కొత్త కొమ్మలు మొలుస్తూ ఉంటుంది.