కాఫీ అంటే చాలామందికి ఉదయం నిద్రలేవగానే గుర్తుకు వచ్చే మొదటి విషయం అదే. అలాంటి కాఫీ ప్రేమికుల కోసం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త వేరియంట్‌ను మీ కోసం తీసుకొచ్చాం. ఇది రుచికరమైనదే కాదు, శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.స్పైసీ హెల్తీ కాఫ – ఇంట్లోనే తయారుచేసే విధానం. ఈ కాఫీ తాగితే శరీరంలో ఉన్న తుమ్మెదలు, చలికాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది, శరీర తాపాన్ని నియంత్రిస్తుంది.

ఫిల్టర్ కాఫీ డెకోక్షన్ – ½ కప్పు, నీరు – 1 కప్పు,పాలు – ½ కప్పు, తేనె లేదా బెల్లం పొడి – 1 టీస్పూన్, దాల్చిన చెక్క పొడి – చిటికెడు, యాలకుల పొడి – చిటికెడు,ఎండు అల్లం పొడి – చిటికెడు, నల్ల మిరియాల పొడి – చిటికెడు, మొదట ఒక చిన్న గిన్నెలో నీరు పోసి మరిగించండి. నీరు మరిగిన తర్వాత అందులో దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, ఎండు అల్లం, మిరియాల పొడి వేసి 2-3 నిమిషాలు మరిగించండి. తరువాత అందులో ఫిల్టర్ కాఫీ లేదా ఇన్‌స్టంట్ కాఫీ వేసి బాగా కలపండి. తర్వాత పాలు జోడించి ఇంకొంచెం మరిగించండి.స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తేనె లేదా బెల్లం పొడి వేసి బాగా కలిపి వడగట్టి కప్పులోకి వేసుకోండి. వేడిగా తాగండి – రోజుకు ఒక్కసారి లేదా రెండు సార్లు తాగవచ్చు.

మెట్‌బాలిజం పెరుగుతుంది, ఈ స్పైసెస్‌తో కూడిన కాఫీ శరీరంలో మెట్‌బాలిజాన్ని పెంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, అల్లం, యాలకులు, మిరియాలు జీర్ణశక్తిని ఉత్తేజితం చేస్తాయి. అజీర్తి, వాంతులు, వాయువు సమస్యలకు ఇది ఉపశమనం. ఈ కాఫీలో ఉండే సహజ దినుసులు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా సీజన్ మారే సమయంలో తాగితే చలికి బాగుంటుంది. చక్కెర లేకుండా తేనె లేదా బెల్లం వాడటం వలన ఆరోగ్యకరం. సాధారణ చక్కెర వాడకుండా తేనె లేదా బెల్లం పొడి వాడటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హానీ ఉండదు.ఈ కాఫీ తాగిన వెంటనే మీరు ఉత్సాహంగా, ఎనర్జీతో నిండినట్టుగా అనిపిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: