చాలామంది పన్నీర్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ పన్నీరు కల్తీగా మంచిదా అని కనిపెట్టేది ఎలాగో తెలియక సతమతం అవుతూ ఉంటారు. మార్కెట్లో లభించే పన్నీర్ నాణ్యత గురించి ఎల్లప్పుడూ కొత్త చర్చ జరుగుతుంది, ఎందుకంటే నకిలీ పన్నీర్ ఆరోగ్యానికి హానికరం. నిజమైన పన్నీర్ మృదువైన, గ్రైనీ టెక్స్చర్ కలిగి ఉంటుంది, అయితే నకిలీ పన్నీర్ స్టార్చ్ లేదా సింథటిక్ పదార్థాల వల్ల చాలా నువుగా మరియు రబ్బరులా ఉంటుంది. ఒక చిన్న పన్నీర్ ముక్కను వేడి నీటిలో వేయండి.

 అది మెత్తగా మారితే అది నిజమే, కానీ అది గట్టిగా ఉన్న లేదా విచ్చన్నమైనా, అది కల్తీ కావచ్చు. పన్నీర్లో కొన్ని చుక్కల అయోడిన్ ద్రవణం వెయ్యండి. అది నీలం రంగులోకి మారితే, అందులో స్టార్చ్ ఉంటుంది. అది నకిలీదని సూచిస్తుంది. నిజమైన పని తేలికపాటి, పాలు రుచిని కలిగి ఉంటుంది. అయితే నకిలీ పని రసాయనాల కారణంగా సబ్బు, పుల్లని లేదా చెడు రుచిని కలిగి ఉండవచ్చు. ఒక చిన్న పన్నీర్ ముక్కలు నిప్పుతో కాల్చండి, అది ప్లాస్టిక్ లాంటి వాసనను వెదజల్లుతుంటే, అది సింథటిక్ లేదా కల్తీ అయ్యి ఉండవచ్చు. పన్నీర్ ను వేళ్ళ మధ్యలోకి నొక్కి ఉంచండి.

అది అదనపు తేమను విడుదల చేస్తే లేదా సులభంగా విరిగిపోతే, అది నిజమైనది. నకిలీ పన్నీర్ చాలా గట్టిగా ఉంటుంది. పన్నీర్ ముక్కను నూనెలో వేయించండి. అది తెల్లగా పొడి అవశేషాలను వదిలి వేస్తే, అందులో స్టార్చ లేదా రసాయనాలు ఉండవచ్చు. కల్తీ పనీలో రసాయన వాసన ఉండొచ్చు లేదా పాల వాసన ఎక్కువగా, కృత్రిమంగా ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పన్నీర్ ముక్క వేసి 10-15 నిమిషాలు ఉంచండి. శుద్ధమైన పన్నీర్ నీటిలో కరగదు. అలాగే దిగువను  సెటిలవుతుంది. పన్నీర్ ను మెత్తగా చేసి, దానిపై అయోడిన్ తడిపిన డ్రాపర్ లేదా అయోడిన్ సొల్యూషన్ కొన్ని చుక్కలు వేయండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ కల్తీ నార్మల్ గుర్తించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: