మానసిక ఆరోగ్యం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రశాంతంగా ఉండాలంటే యోగా ముఖ్య అవసరం. మీరు ఈ రోజుని ధ్యానంతో మొదలుపెట్టండి. రోజు కాసేపు మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తే ప్రశాంతాన్ని పొందవచ్చు. నాణ్యమైన నిద్ర ఉన్నట్లయితే మూడ్ బాగుంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి నిద్ర పోవడానికి ముందు మొబైల్, టీవీలకు దూరంగా ఉండటం కూడా అవసరం.

 ఆరోగ్యకరమైన ఆహారం కూడా మీ మూడ్ మెరుగు పరుస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి పోషకాహారాన్ని తినడం చాలా అవసరం. దీనికోసం తాజా పండ్లు, కూరగాయలు, సెరటోనిన్, మెగ్నీషియం ఎక్కువగా గల ఆహారాలు తినడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనం తప్పక అన్ని పనులు చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఎవరైనా చెప్పిన పనులకి నో చెప్పే కాసేపు రెస్ట్ తీసుకోండి. దీంతో ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ పై దృష్టి పెట్టాలి. రోజు వ్యాయామం, డాన్సింగ్ ఇటువంటివి చేస్తే మూడ్ బాగుంటుంది. కాసేపు వాకింగ్, జాగింగ్ కూడా చేయొచ్చు.

సంతోషాన్ని ఇచ్చే పెయింటింగ్, గార్డెనింగ్ లేదా మ్యూజిక్ ఇటువంటి వాటితో కాసేపు సమయాన్ని గడిపితే మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. మీకు నచ్చిన పుస్తకాలు చదవడం, గ్రాటిట్యూడ్ జనరల్ లేదంటే పాజిటివ్ ఆలోచనలతో రోజుని గడిపితే ప్రశాంతంగా ఉండొచ్చు. మూడ్ కూడా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఇష్టపడే వ్యక్తులతో నాణ్యమైన సమయాన్ని గడిపితే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవుతుంది. సంతోషంగా ఉండవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి పోషకాహారాన్ని తినడం చాలా అవసరం. దీనికోసం తాజా పండ్లు, కూరగాయలు, సెరటోనిన్, మెగ్నీషియం ఎక్కువగా గల ఆహారాలు తినడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: