చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ క్యాన్సర్ ముప్పు మరింతగా వేధిస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ క్యాన్సర్ సమస్య ఉండే ఉంటుంది. దేశంలో క్యాన్సర్ వ్యాధి మరింతగా వ్యాపిస్తుంది. ప్రస్తుత భారతదేశంలో చాలామంది ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో క్యాన్సర్ రిస్క్ ఒకటి. హెల్త్ చెకప్ చేయించుకోకపోవడం ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, వ్యాయామం లేకపోవడం వల్ల కారణాల వల్ల ఈ సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. ప్రతిరోజు 20 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల బాడీకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ప్రతిరోజు ఉదయం 20 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండడం వల్ల బాడీకి విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి తక్కువగా ఉండే బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కులాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇంఫ్లమేషన్, ఇన్సులిన్ రేసిస్టెన్స్ పై నెగిటివ్ ప్రభావం చూపుతాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని లింక్ అయ్యే ఉంటాయి. కాబట్టి ఎక్కువ సేపు కూర్చోవద్దు. మధ్య మధ్యలో స్ట్రైచింగ్ చెయ్యాలి. రోజుకి ఒక్కసారి గ్రీన్ టీ తాగడం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి. గ్రీన్ టీ తాగితే వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.

 ఆరోగ్యం కూడా బాగుంటుంది. పసుపులో ఆంటీ ఆక్సిడెంట్స్, ఆంటీ ఇంఫ్లమేటరి గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పసుపును డైట్ లో చేర్చుకుంటే కూడా క్యాన్సర్ రిస్కు తగ్గుతుంది. గార్డెనింగ్ లాంటివి చేయడం వల్ల నాడీ వ్యవస్థ పై ఒత్తిడి తగ్గుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ జరగడం వల్ల బాడీ క్లీన్ అవుతుంది. క్యాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. ప్రతిరోజు కొన్ని మెట్లు ఎక్కుతూ ఉంటే కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సమస్యలు కూడా తగ్గుతాయి. క్యాన్సర్ రిస్కు కూడా తగ్గుతుంది. ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడిపితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. స్క్రీన్ ముందు ఎక్కువ సమయాన్ని గడిపితే మెలట్రోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మంచి నిద్రకి సహాయం చేస్తుంది. అలాగే వివిధ క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: