బాల విజ్ఞానం: పెద్దలకు కూడా: ఎడారి మద్యలో ఒయాసిస్ లోకి నీరెలా వస్తుంది? పిల్లల ప్రశ్న - మీ సమాదానం? ఒయాసిస్ కథ
చిన్నపిల్లలు సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు. సమాదానం చెప్పలేని మనం “చొప్పడంటు ప్రశ్నలడకుండా స్కూల్ హోం వర్క్ చేసుకొని మాస్టారు చెప్పిన పాఠాలు చదువుకోండని” గదమాయించటం సాధారణ తల్లిదండ్రులు చేసేపని.
మీరు సరిగ్గా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే, ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే మీరు న్యూటన్, మీ పిల్లవాడు ఐన్స్-టీన్ కావటం తధ్యం. లేదా భారత్ విజ్ఞానవంతమైన దేశం గా తయారై న్యూటన్లు, ఐన్-స్టీనులు ఈ దేశములోనే తయారవుతారు.
నిన్న మా ఆఫీస్ లిఫ్ట్ లో కిందకు దిగుతుంటే వాళ్ళ మమ్మీని “మమ్మీ! హౌ ఒయాసిస్ అర్ జనరేటెడ్ ఇన్ డిసెర్ట్స్?” మమ్మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిఉండీ ఆ పిల్లవాడి ముందు బేలగా నిల్చింది. అదృష్ఠవశాత్తు నేను సమాదానం చెప్పగలిగాను. ఇప్పుడు ఆ పిల్లవాడు నాకు స్నేహితుడు. “ఐ హవ్ మువ్డ్ బాక్ టు చైల్డ్-హుడ్”
అయితే నా సమాదానం యాజ్ ఫాలోస్:
ఎడారుల్లో వర్షం బహు అరుదుగా పడుతుంది.వర్షం పడ్డా ఇసుక కూడా తడవనంత. అయినా ఎడారి మధ్య లో అక్కడక్కడ నీటి పడియలు కనిపిస్తూనే ఉంటాయి అలా ఎడారిలో పయనించే మనుషులకు, ఒంటెలకు ఆ నీరే జీవనాధారము. అయితే ఆ ఒయాసిస్సుల్లోకి నీరెలా చేరుతుంది? ఏడారిలో ఆ స్వల్ప నీటి జల్లే నీటి పడియలాగా ఏర్పడిందంటే ? నమ్మగలమా?
ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం. అసలు మామూలు ప్రదేశాల్లో వర్షించిన వాన నీరు ఎమవుతుంది? కొంత నీరు చెరువులు, కుంటల్లో నిలవ వుంటుంది. కొంతనీరు జాలువారి కాలవల ద్వారా నదిని చేరి నదీప్రవాహం ద్వారా సముద్రములో కలిసిపోతుంది. కొంత నీరు సూర్య రశ్మి ద్వారా ఆవిరవుతుంది. కొంత నీరు భూమిలో ఇంకి పోతుంది. ఇదుగో ఈ ఉంకిపోయిన నీరే మనకు కావలసింది.
రాళ్ళు, ఇసుక వంటి వాటితో ఉన్న భూ పై పొర నుండి వాన నీరు భూమి లోనికి పోయి బంకమట్టిగాని, రంద్రాలులేని రాతి పలకల పొర ఉన్నంతవరకూ వెళ్ళి ఇంకా అంతకన్నా కిందికి వెళ్ళలేక అక్కదే నీటి మడుగులా ఏర్పడుతుంది. నుయ్యి తొవ్వినప్పుడు పడే నీరు ఇదే. ఇంకి భూమి లోపలికి పోయిన నీరు ఇంకా క్రిందకు పోలేకపోయినా ఖాళీలు ఉన్న చోట్లు వెతుక్కుంటూ భూమి ఉపరితలానికి సమాంతరంగా భూమిలోపల ప్రవహిస్తుంది. అందుకే నీటిని నుయ్యి నుండి ఎంతతోడినా కాసేపట్లో మరల నీరు ఊరుతుంది. ఇదే పరిస్థితి వేసవి కాలములో నీరులేని నదిలో కూడా ఇసుక చలమల లో నీరు ఊరి ప్రయాణికుల దాహార్తిని తీరుస్తుంది.
అయితే, ఈ విధంగా భూమి లోపల నీరు దారువెతుక్కుంటూ అసలు వర్షం పడ్డ చోటునుండి చాలా దూరం వెళ్ళగలదు. భూమిలోపల నీరు ఆవిరయ్యే ప్రశక్తే లేదు కాబట్టి నీరు పల్లమెరుగు అనే సామెత ప్రకారం రంద్రాలు లేని రాతిపొర, బంకమట్టి పొర ఎగుడు దిగుళ్ళను అధిగమించి ఒక్కో సారి లోపలి ప్రవాహ వత్తిడితో నేలపైకి ఎగతన్నవచ్చు. అదే ఊట (స్ప్రింగ్) గా పిలవబడుతుంది. ఎక్కడో వేలమైళ్ళ దూరాన కొండలు, పర్వత సానువులపై పడ్డ వాన నీరు భూమిలోనికి ఇంకి లోలోపలే జలధారగా మారి అంతర్వాహినై ప్రవహిస్తుంది. అనేక వందల వేల మైళ్ళు వెళ్ళి ఎడారి మధ్యలో భూమిపైకి తన్నుకొని వచ్చి నీరు నిలువై ఉంటుంది. అదే ఒయాసిస్సు