పళ్లుముల, పండ్లు, ఆకులు, వక్కలు పూలు చలిమిడి, గాజులు, స్వీటు, హాట్ పంచి పెట్టుసామానులు.
పుల్లటివి : పెద్ ఉసిరి, చిన్న ఉసిరి, నిమ్మకాయలు, చింతకాయలు, మామిడికాయలు, నారింజ, బత్తాయి, కమలాలాు
డ్రై ఫ్రూట్స్ : జీడి పప్పు, బాదం పప్పు, పిస్తాపప్పు, చెర్రీస్, కిస్మస్, అక్రోట, అంజూర చాక్లెట్లు, బిస్కెట్లు, పసుపు కుంకుమ, మలిమిడి తయారు చేసే గస గసాలు
అద్దవలెను. పిదప ఒక నిదుర చేయవలెను. ముందుగా అమ్మాయిని ఆనాటి సాయంత్రం వెళ ముత్తైదువులు అమ్మాయిని కూర్చీ లో కూర్చుండబెట్టి హారతి పాట పటాడి బొట్టు పెట్టి కొత్త చీర ఇవ్వవలెను.
ఆ చీర కట్టుకొని వచ్చిన తరువాత కుర్చీలో కూర్చుండబెట్టి హారతి వెలిగించి, హారతి పాటలు పాడి, హారతి అమ్మాయికి అద్ది ఒడిలో మూడు ముద్దల చలిమిడి, పసుపు కుంకుమ జాకెట్టు వస్త్రము పీచు కొబ్బరికా, పండ్లు, తాంమూలము, పూలు పెట్టవలెను. పళ్లెములో తెచ్చిన స్వీట్లు అన్ని అమ్మాయి చేతికి అందిస్తారు. చలిమిడి ఒడిలోనికి మూడు చిన్న ముద్దలు చేయవలెను.
కొందరు గాజుల మనిషి చేత ముత్తైదువులకు పిల్లలకు అందరికి గాజులు వేయించుతారు. అతిధులకు బొట్టు, మట్టి గాజులు గంధము ఇచ్చి పళ్ళెములలో ఉన్న అన్ని రకాల ఐటమ్స్ ఒక కవరులో వేసి ఇవ్వవలెను. వసతి కలవారు వింధుభోజనం ఏర్పాటు చేస్తారు.