టెక్నాల‌జీ ప‌రంగా భార‌త్ కూడా ప్ర‌పంచంలో టాప్ ప్లేస్‌లో ఉండాలి. ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దు. ఈ డిజిట‌ల్ యుగంలో దుమ్మురేపే ప‌వ‌ర్ భారతీయుల‌ చేతిలో ఉండాలి. ఇందుకోసం జియో అనే ఆయుధం ఊహించ‌నంత భారీగా భార‌తీయుడికి డిజిట‌ల్ లైఫ్ ఇచ్చేసింది. అర‌చేతిలో అఖండ విశ్వం వ‌చ్చి చేరింది. సామాన్యుడి డిజిట‌ల్ క‌ల నెర‌వేర్చిన ఈ ప్రాజెక్టు ఐడియా వెనుక ఓ పాతికేళ్ల యువ‌తి ఉంది. 
Image result for isha ambani jio

కర్లో దునియా ముట్టీ మే.. అంటూ కొద్ది సంవత్సరాల క్రితం మొబైల్ ఫోన్లను ప్రవేశపెట్టింది రిలయన్స్. అదే తరహాలో 2016లో జియో డిజిటల్ జీవితాన్నిఆస్వాదించండి.. అంటూ జియో సిమ్ ను ప్రవేశపెట్టారు రిల‌య‌న్స్ అధినేత‌ ముకేశ్ అంబానీ. జియో రాకతో నిజంగానే ప్రజల గుప్పిట్లో డిజిటల్ ప్రపంచం ఇమిడిపోయింది. అప్పటివరకు సామాన్యుడికి అందని ద్రాక్షగా ఉన్నమొబైల్ డేటాను అతి చౌక ధరకే అందుబాటులోకి తెచ్చిన జియో.. టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించింది. అప్ప‌టిదాక భారీ ధ‌ర‌కు డేటాను అందిస్తున్న దిగ్గజ కంపెనీలన్నీ జియో దెబ్బకు కుదేలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వాడకంలో 150వ స్థానంలో ఉన్న భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం వెనుక ప్ర‌ధాన కార‌ణం జియో. ప్రవేశపెట్టిన రెండేళ్ల‌లోనే  ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ బ్రాడ్ బ్యాండ్ డేటాగా టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే - ఇప్పటివరకు `జియో` వెనుక ఉన్న మాస్టర్ బ్రైన్ ముకేశ్ అంబానీదని అంతా అనుకుంటున్నారు. అయితే తన ముద్దుల కూతురు ఇషా ఐడియాతోనే తాను జియోకు శ్రీకారం చుట్టానని  స్వయంగా అంబానీ తెలిపాడు.

Related image

ముఖేశ్‌ అంబానీ గారాల ప‌ట్టి ఈషా ‘ఫోర్బ్స్‌’ యంగెస్ట్‌ బిలియనీర్‌గా గుర్తింపుపొంది , ఆసియాలోనే శక్తివంతమైన భవిష్యత్తు వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచింది. టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘జియో’ ఆలోచనకు బీజం వేసి, సత్తా చాటుకున్న ఘనత ఆమె సొంతం. అలాంటి నవయుగ యువరాణి ఇటీవ‌లే మ్యారేజ్‌లైఫ్‌లోకి అడుగుపెట్టింది. అంబానీ ముద్దుబిడ్డ ఈషా తన చిన్ననాటి స్నేహితుడైన ఆనంద్‌ పిరమాల్‌ను వివాహం చేసుకుంది. అయితే ఈషా అంబానీ కేవలం తండ్రి చాటు కూతురేం కాదు.. బిజినెస్‌ ‘సైకాలజీ’ తెలిసిన అసలు సిసలు ఈ త‌రం వ్యాపారవేత్త. విజ‌య‌వంతంగా సాగుతున్న కంపెనీని మ‌రింతా వేగంగా న‌డిపే టాలెంట్ ఉన్న ఈ త‌రం అమ్మాయి.
 Related image
ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో అనంత్‌ అంబానీ తర్వాత ఈషా, ఆకాశ్‌లు కవలలుగా పుట్టారు. ఈషా ప్రసిద్ధ యేల్‌ యూనివర్శిటీలో సైకాలజీ చదివింది. అమెరికాకు చెందిన మేనేజ్‌మెంట్‌ సంస్థ మెకెన్నీ అండ్‌ కంపెనీలో కొన్నాళ్లు బిజినెస్‌ అనలిస్టుగా పనిచేసింది. అదే సమయంలో ముకేష్‌ టెలికాం రంగంలోకి ప్రవేశించాడు. అప్పటికే ఈ రంగంలో పోటీదారులు విపరీతంగా ఉండటంతో కొత్త ఆఫర్లతో మాత్రమే వినియోగదారులను హృదయాలను గెలుచుకోవచ్చని భావించాడు. అలాంటి సందర్భంలో రిలయన్స్‌ ‘జియో’తో ఒక్కసారిగా ఈషా, ఆకాష్‌లు తెరమీదకు వచ్చారు.
 
‘జియో’ ఆవిష్క‌ర‌ణ సందర్భంగా నీతా అంబానీ తన కూతురు, కొడుకులను వేదిక మీదకు ఆహ్వానించినప్పుడు, ముందు వరుసలో కూర్చున్న ముకేష్‌ వారిని చూస్తూ ముగ్ధుడయ్యాడు. ఈషా ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన ప్రతీ మాటను ఆసక్తిగా విన్నాడు. అప్పటికే ఆయన రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ ‘బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల’లో ఒకరిగా ఈషాను నియమించారు. ఆ హోదాలో ఈషా ‘జియో’ను ఎంతో ఆత్మవిశ్వాసంతో వినియోగదారులకు పరిచయం చేసింది. ‘దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ‘జియో’ ఆలోచన వెనక ఈషా ఉందని స్వయంగా ముకేశ్‌ అంబానీ చెప్పడంతో ఈషా ప్రతిభ ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 2016లో ‘అజియో’ పేరిట ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌కు శ్రీకారం చుట్టింది ఈషా. రిలయన్స్‌ రిటైల్‌కు అనుబంధంగా ఉండే ఈ బ్రాండ్‌ను ఆమె ఇంట‌ర్నేష‌న‌ల్‌గా విస్తరించింది.
 Image result for isha ambani jio
తండ్రిలాగే బాలీవుడ్‌ స్టార్స్‌తో స్నేహబంధాలు ఏర్పరచుకున్న ఈషా ‘జియో’కు షారుక్‌ఖాన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది. బిజినెస్‌రంగంలో ఎంత బిజీగా ఉన్నా అనుబంధాలకు మాత్రం దూరం కాదంటారు ఆమె సన్నిహితులు. నానమ్మ కోకిలాబెన్‌కు అన్నివేళలా చేదోడు వాదోడుగా ఉంటుంది. వీకెండ్స్‌లో స్నేహితులను కలవడం, చారిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఈషాకు ఇష్టం.

ఇక ఈషా త‌న ముందున్న‌ మ‌రో బిగ్ ప్రాజెక్టు భార‌తీయుల జీవితాలు మ‌రింతా స్మార్ట్ గా మార‌బోతున్నాయి. జియోలో 5జీ నెట్‌వ‌ర్క్ తీసుకొచ్చి స్మార్ట్ హోమ్‌, స్మార్ట్ వెహికిల్.. ఇలా అన్ని రంగాల్లో డిజిట‌ల్ చేసేసి డిజిట‌ల్ లైఫ్ అంటే ఏంటో చూపించ‌డానికి రంగంలోకి దిగిపోయింది ఈషా. తాత ధీరుబాయ్ అంబానీ స్వ‌యంకృషితో కుబేరుడిగా ఎదిగితే, తండ్రి ముఖేష్ విజ‌య‌మార్గంలో ప‌య‌నిస్తే, తాను మాత్రం ఆ డ‌బ్బు పెట్టిబ‌డితో త‌న ఐడియాల‌ను అమ‌లు చేస్తూ భార‌తీయుల జీవన విధానాన్ని స్మార్ట్‌గా మార్చేస్తానంటూ భారీ ఆలోచ‌న‌ల‌తో రంగంలోకి దిగింది. కోట్లాది మందికి స‌రికొత్త జీవ‌న రుచిని చూపిస్తున్న‌ ఈషా ఈత‌రం యువ‌త‌కు గొప్ప స్ఫూర్తి.  



మరింత సమాచారం తెలుసుకోండి: