సునీల్ కుమార్‌ని పక్కకు తప్పించి ఎంఎస్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఇక ఎన్నికల్లో బాబు, లలిత కుమారిపై దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్...నియోజకవర్గంలో సైలెంట్‌గా పనిచేసుకుంటున్నారు. ఎక్కువ హడావిడి చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో స్థానిక సంస్థల అభ్యర్ధుల సాయంతో నియోజకవర్గంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు.
అటు ప్రభుత్వ పథకాల వల్ల పూతలపట్టు ప్రజలు ఎక్కువగానే లబ్దిపొందుతున్నారు. అయితే నియోజకవర్గంలో తాగునీటి, సాగునీటి సమస్యలని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బాబు కృషి చేస్తున్నారు. ఇక పార్టీ పరంగా వైఎస్సార్‌సీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పటికే టీడీపీ కేడర్ చాలావరకు బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి వచ్చేసింది. అటు లలితకుమారి కూడా టీడీపీని వీడటంతో, వైఎస్సార్‌సీపీకి బాగా కలిసొచ్చింది
గత 27 ఏళ్ల నుంచి టీడీపీలో ఉంటున్న లలిత... పలమనేరు నియోజకవర్గం నుంచి 2004లో విజయం సాధించారు. ఇక 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పూతలపట్టు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ సమయంలో తనవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఆమె టీడీపీని వీడారు. ఇప్పుడు అక్కడ టీడీపీని నడిపించే నాయకులే లేరు. ఇలా టీడీపీ వీక్ అవ్వడంతో, ఎమ్మెల్యే బాబుకు బాగా అడ్వాంటేజ్ అవుతుంది.