తెలుగుదేశం నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో బాగా స్ట్రాంగ్‌గా ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. వారికి అధికారంలో ఉన్న వైసీపీ సైతం చెక్ పెట్టడం కష్టమైపోతుంది. వారి స్పీడుకు జగన్ పథకాలు సైతం బ్రేకులు వేయలేకపోతున్నాయి. అలా టీడీపీలో బాగా స్ట్రాంగ్‌గా ఉన్న వారిలో మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు..ముందు వరుసలో ఉంటారు. టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వేగుళ్ళ... 2004 ఎన్నికల్లో  టీడీపీ తరుపున తూర్పుగోదావరి ఆలమూరు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2005 స్థానిక సంస్థల ఎన్నికల్లో మండపేట మున్సిపాలిటీని టీడీపీకి దక్కేలా చేసి, చైర్మన్ పదవి దక్కించుకున్నారు.

ఇక 2009లో మండపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి వేగుళ్ళ...ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఉన్న, పరిష్కరించడంలో ముందున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ, సాధ్యమైన మేర పనులు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు నియోజకవర్గ ప్రజలకు బాగానే అందుతున్నాయి. వివాదరహితుడిగా ఉన్న వేగుళ్ళ, అన్ని వర్గాల ప్రజలని కలుపుని వెళుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. ఇటీవలే ఆయనకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారు.

ఇక మండపేటలో టీడీపీ అధికారంలో ఉండగా అభివృద్ధి బాగానే జరిగింది. వేగుళ్ళ అప్పుడు అధికార ఎమ్మెల్యేగా 40 గ్రామాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయగా,  మెట్ట ప్రాంతాలైన కేశవరం, ద్వారపూడి, జెడ్‌ మేడపాడులని పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారు. తాగునీటి సమస్యలని కూడా లేకుండా చేశారు. ఇంకా తాపేశ్వరం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అలాగే మండపేటలో మహిళా ఇంటర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

ఇక వైసీపీ తరుపున మండపేటలో తోట త్రిమూర్తులు పనిచేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో పిల్లి సుభాష్, వేగుళ్ళపై ఓటమి పాలయ్యారు. అయితే ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడంతో మండపేట భాద్యతలు తోట చూసుకుంటున్నారు. అయితే తోటకు పిల్లి వర్గం సహకరించడం కష్టం. అదే సమయంలో నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కమ్మ వర్గం వేగుళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. తోట అంటే పడని శెట్టిబలిజలు కూడా వేగుళ్ళ వైపే వస్తున్నారు. ఒక్క కాపు సామాజికవర్గం మాత్రమే తోటకు మద్ధతు ఉంది. అయితే వివాదరహితుడైన వేగుళ్ళకు చెక్ పెట్టడం తోటకు కష్టమైన పనే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: