
ఇక తర్వాత వైఎస్సార్ మరణంతో, చెన్నకేశవ...జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చేశారు. ఆ వెంటనే 2012లో జరిగిన ఉపఎన్నికల్లో చెన్నకేశవ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో బివి మోహన్ రెడ్డి తనయుడు బివి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ తరుపున బరిలో దిగి, వైసీపీ అభ్యర్ధి కె జగన్ మోహన్ రెడ్డిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ చెన్నకేశవ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి టీడీపీ యువనేత జయనాగేశ్వర్‌ని ఓడించారు.
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవ, నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రజలకు వీలైనంత వరకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఎమ్మిగనూరు చేనేత రంగానికి కీలకంగా ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. జగన్ ప్రభుత్వం నేతన్న హస్తం పేరిట చేనేత కార్మికులకు రూ.24 వేలు సాయం అందించారు. ఈ పథకం వల్ల చేనేత కార్మికులకు కాస్త ఆర్ధిక ఇబ్బందులు తగ్గాయి. దీంతో పాటు మిగతా పథకాలు కూడా సజావుగానే అందుతున్నాయి.
అయితే ఇక్కడ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరు సరిగా అందక తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే నియోజకవర్గంలో రూరల్ ప్రాంతాల్లో రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అయితే తాగునీటి సమస్య పరిష్కారం చేస్తే ఎమ్మెల్యేకు తిరుగుండదు.
కాకపోతే గతంలో టీడీపీ హయాంలో జరిగినట్లుగా...ఈ ఏడాదిలో వైసీపీ హయాంలో జరగలేదు. నిధులు సరిగా అందకపోవడం వల్ల అభివృద్ధి శూన్యమైంది. అటు టీడీపీ యువ నాయకుడు బిఎన్ జయనాగేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఎమ్మిగనూరు టీడీపీకి కంచుకోట కాబట్టి, జయనాగేశ్వర్‌కు త్వరగా పుంజుకునే అవకాశం దక్కింది. అయితే చెన్నకేశవ రెడ్డి పలు సమస్యలని పరిష్కరిస్తే తిరుగుండదు.