త్వరలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఉప ఎన్నికలో గెలవాలనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలి గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ వైసీపీకే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉండటం వైసీపీకి మెయిన్ అడ్వాంటేజ్. అలాగే తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

పైగా భారీ మెజారిటీలతో గెలిచారు. కాబట్టి 7 స్థానాలు తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా సత్యవేడు నియోజకవర్గం బాగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం దూసుకెళుతున్నారు. పైగా 2019 ఎన్నికల్లో ఆదిమూలం దాదాపు 44 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలని సజావుగా అందిస్తున్నారు. అలాగే ఇళ్ల పట్టాల పంపిణీ బాగా అడ్వాంటేజ్ అవుతుంది. అటు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలు కూడా ప్లస్ అవుతాయి. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. తాగునీరు సమస్యలు అధికం. అయితే సత్యవేడుపై ఎమ్మెల్యే కంటే జిల్లా మంత్రులకే ఎక్కువ పట్టు ఉండటం వల్ల, ఎమ్మెల్యే పెద్దగా పనులు చేయించలేకపోతున్నారనే వాదనలు ఉన్నాయి.

అటు టీడీపీ వైపు జడ్డా రాజశేఖర్ ఉన్నారు. ఓడిపోయిన దగ్గర నుంచి రాజశేఖర్ కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే ప్రతి పోరాటాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే కేడర్‌ని సమన్వయం చేసుకుని పార్టీ బలోపేతం అయ్యేలా కృషి చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనే దిశగా రాజశేఖర్ ముందుకెళుతున్నారు. అయితే రాజశేఖర్ ఎంత వర్క్ చేసినా సత్యవేడులో వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ ఇప్పటికీ బలంగా ఉండటం వల్ల తిరుపతి పార్లమెంట్‌లో మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: