అయితే నెక్స్ట్ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పని ఖతం కావడంతో మళ్ళీ గంటాతో కలిసి టీడీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో అదే పశ్చిమ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అప్పుడు టీడీపీ కూడా అధికారంలో ఉండటంతో గణబాబు బాగా పనిచేసారు. ఇక అదే ఊపులో 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా ఉన్నాసరే గణబాబు మాత్రం 18 వేల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మళ్ల విజయ్ ని ఓడించారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాసరే ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. పెద్దగా వివాదాలు జోలికి పోని గణబాబు, తన పని తాను సైలెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జ్ గా మళ్లనే కొనసాగుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా సరే మళ్ల ఇక్కడ బలపడలేదు. దీంతో వైసీపీ గణబాబుని లాగేసుకుందామని అనేకసార్లు ప్రయత్నాలు చేసింది. కానీ గణబాబు టీడీపీలోనే ఉన్నారు.
ఒకానొక గంటా కూడా సైలెంట్ కావడంతో గణబాబు కూడా వైసీపీ వైపుకు వెళ్ళడం ఖాయమని ప్రచారం జరిగింది. అలాగే వాసుపల్లి గణేశ్ పార్టీని వీడిన సమయంలో సైతం గణబాబు టీడీపీకి షాక్ ఇవొచ్చని ప్రచారం జరిగింది. కానీ గణబాబు టీడీపీలోనే ఉంటూ, పని చేసుకుంటున్నారు. అయితే విశాఖ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని చూస్తున్న వైసీపీ, టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తుంది. గణబాబు వైసీపీ వైపు రాకపోవడంతో, విజయసాయి ఆయన్ని గట్టిగా టార్గెట్ చేశారు. తజగ భూ కబ్జా ఆరోపణలు సైతం చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా గణబాబు టీడీపీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ గణబాబు మాత్రం స్ట్రాంగ్ గానే ఉన్నారు. మరి భవిష్యత్‌లో విశాఖ రాజకీయం ఎలా ఉంటుందో చెప్పలేం.