2019 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ అదిరిపోయే వ్యూహాలతో, వైసీపీ కమ్మ నాయకులని పోటీలోకి దించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల్లో టీడీపీ కమ్మ నేతలకు పోటీగా వైసీపీ నుంచి కమ్మ నాయకులని నిలబెట్టి విజయం అందుకున్నారు. అలా తెనాలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కమ్మ నాయకుడు ఆలపాటి రాజాపై, వైసీపీ తరుపున అన్నాబత్తుని శివకుమార్‌ని నిలబెట్టారు. ఊహించని విధంగా అన్నాబత్తుని విజయం సాధించారు.


అయితే శివకుమార్ 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి, ఆలపాటి రాజా చేతిలో ఓడిపోయారు. అయితే ఓడిన శివకుమార్ ఐదేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కష్టపడ్డారు. కాకపోతే 2019 ఎన్నికల ముందు శివకు టికెట్ రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే శివ…తన బందువైన సినీ నటుడు మోహన్ బాబు ద్వారా టికెట్ దక్కేలా చేసుకున్నారని ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. మోహన్ బాబు చెప్పడం వల్లే జగన్, శివకు టికెట్ కేటాయించారని తెలిసింది.


ఇక ఆ విధంగా టికెట్ దక్కించుకున్న శివకుమార్, తెనాలిలో భారీ మెజారిటీతోనే గెలిచారు. గెలిచాక నియోజకవర్గంలోనే పనిచేసుకుంటూ ఉన్నారు. అలాగే టీడీపీని దెబ్బకొట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అమరావతి ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో చంద్రబాబు టార్గెట్‌గా శివ నానా రకాల విమర్శలు చేశారు. అప్పుడు తీవ్రంగా స్పందించిన శివ...మళ్ళీ చంద్రబాబుపై ఎప్పుడు విమర్శలు చేసినట్లు కనబడలేదు.


ఇక ఎమ్మెల్యేగా శివ తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేకు ప్లస్ అవుతున్నాయి. పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకున్నారు. అయితే అమరావతి అంశం లోకల్ ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. అటు టీడీపీ నేత ఆలపాటి రాజా సైతం, పార్టీ తరుపున గట్టిగానే పోరాడుతున్నారు. అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరి చూడాలి వైసీపీ కమ్మ ఎమ్మెల్యేకు, టీడీపీ కమ్మ నేత చెక్ పెట్టగలరో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: