నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కావలి ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ కేవలం మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇంకా ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత నుంచి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది.


ఇక్కడ రెండు సార్లు వైసీపీ తరుపున కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలుస్తున్నారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్‌కు కావలిపై మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రామిరెడ్డి ముందున్నారు. సాగునీరు, తాగునీటి సమస్యలు రాకుండా రామిరెడ్డి కష్టపడుతున్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లని బాగుచేయిస్తున్నారు. అటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగనన్న కాలనీలు పేరిట పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం జరుగుతుంది.


ప్రభుత్వం పథకాలు ఎమ్మెల్యే రామిరెడ్డికి బాగా ప్లస్ అవుతున్నాయి. అలాగే కావలిలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కావలి పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. అలాగే మారుమూల గ్రామాల్లో రోడ్లు సరిగ్గా లేవు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ రామిరెడ్డికి తిరుగులేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ పరిస్తితి అసలు బాగోలేదు. మామూలుగానే కావలిలో టీడీపీ వీక్‌గా ఉంటుంది. ఇప్పుడు మరింత వీక్‌గా ఉంది.


పైగా మొన్నటివరకు టీడీపీకి సపోర్ట్‌గా ఉన్న సీనియర్ నేత బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లారు. దీంతో కావలిలో టీడీపీ కేడర్ వైసీపీ వైపుకు వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున ఓడిపోయిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద యాక్టివ్‌గా ఉండటం లేదు. అటు బీదా రవిచంద్రాయాదవ్ సైతం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. దీంతో కావలిలో టీడీపీకి పుంజుకునే ఛాన్స్ కనిపించడం లేదు. అదే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: